Volkswagen CEO quits

Volkswagen boss quits over diesel emissions scandal

Volkswagen CEO, Volkswagen, Martin Winterkorn, erman carmaker,diesel cars pollute, diesel emissions scandal, Martin Winterkorn resign

Volkswagen boss quits over diesel emissions scandal. Volkswagen Chief Executive Martin Winterkorn resigned on Wednesday, succumbing to pressure for change at the German carmaker, which is reeling from the admission that it deceived U.S. regulators about how much its diesel cars pollute.

ఫోక్స్ వ్యాగన్ సిఈఓ రాజీనామా

Posted: 09/24/2015 08:15 AM IST
Volkswagen boss quits over diesel emissions scandal

ప్రపంచ ఆటోమోటివ్స్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జర్మనీకి చెందిన ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాలుష్య ఉద్గార కుంభకోణం నేపథ్యంలో కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్టిన్ వింటర్‌కార్న్ తన పదవికి రాజీనామా చేశారు. కంపెనీపై తాజాగా వెళ్లువెత్తుతున్న ఆరోపణల నేపథ్యంలో ఐదు మంది డైరెక్టర్ల బృందం ఒత్తిడి తీసుకరావడం వల్లనే మార్టిన్ తన పదవి నుంచి వైదొలుగినట్లు సమాచారం. తాజా పరిస్థితులు తనకు సాక్ కలిగిస్తున్నాయని ఆయన అన్నారు.  ప్రపంచంలో కార్ల తయారీలో రెండో అతిపెద్ద సంస్థయైన ఫోక్స్‌వ్యాగన్‌పై జర్మనీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాలుష్య పరీక్షల్లో పాసయ్యేందుకు రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ప్రపంచ వ్యాప్తంగా కోటికిపైగా కార్లలో అమర్చినట్లు సంస్థ ఇటీవల ఒప్పుకున్నది.

దీనిపై విచారణ చేపట్టిన జపాన్ ప్రభుత్వ ఉన్నతాధికారులు వాల్ఫ్‌బర్గ్‌లో ఉన్న సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్నట్లు ఫెడరల్ ట్రాన్స్‌పోర్ట్ మంత్రి అలెగ్జాండర్ ప్రకటించారు. జర్మనీ, యూరప్ మార్గదర్శకాలకు లోబడి సంస్థ వ్యవహరించిందా.. లేదా.. తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ కమిటీకి ఆ దేశ రవాణా శాఖ మంత్రి మైకేల్ నాయకత్వం వహించనున్నారు. కంపెనీ పేర్కొన్న విధంగానే కాలుష్యం వెలువడుతుందా..అంతకుమించి అధిక మోతాదులో వెలువడుతున్నాయో ఒకసారి పరిశీలించిన తర్వాత ఆ సంస్థపై క్రిమినల్ కేసులు పెట్టాలన్న యోచనలో అమెరికన్ అధికారులున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల అమెరికాలో ప్రారంభమైన ఈ కుంభకోణం ప్రస్తుతం ఇతర దేశాలకు వ్యాపించింది. యూఎస్‌లో ఇప్పటి వరకు 50 లక్షల డీజిల్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది కూడా.

ఫోక్స్‌వ్యాగన్ అమర్చిన ఈ ప్రత్యేక సాఫ్ట్‌వేర్.. కారు నడుస్తున్నప్పుడు ఉద్గార నియంత్రణ వ్యవస్థను పనిచేయకుండా ఆపేస్తుంది. కాలుష్య పరీక్ష చేస్తున్న సమయంలో మాత్రమే ఈ కంట్రోల్స్ పనిచేసేవిధంగా రూపొందించింది. కాలుష్య పరీక్షలో పాసయ్యేందుకు వీలుగా కంపెనీ ఉద్దేశపూర్వకంగానే ఈ సాఫ్ట్‌వేర్‌ను కార్లలో అమర్చిందని అమెరికా అధికారులు ఆరోపిస్తున్నారు. 40 శాతం అధికంగా కాలుష్యాన్ని వెదజళ్లనున్నది. ఫ్రాంక్‌ఫర్ట్ స్టాక్ ఎక్సేంజ్‌లో కంపెనీ షేరు ధర మంగళవారం 20 శాతం మేర పడిపోయింది. గడిచిన రెండు రోజుల్లో షేరు విలువ 36 శాతం మేర క్షీణించడంతో 2700 కోట్ల యూరోల మార్కెట్ విలువను కోల్పోయింది. కంపెనీలో తలెత్తుతున్న పరిణామాల నేపథ్యంలో జర్మనీ చాన్సలర్ ఎంజెలా మోర్కెల్ మాట్లాడుతూ.. సాధ్యమైనంతగా తొందరగా కోలుకోవాలని వ్యాఖ్యానించారు. మొత్తంగా ప్రపంచ ఆటోమోటివ్స్ రంగంలో అగ్రగామి కంపెనీగా పేరున్న ఫోక్స్ వాగన్ కంపెనీ అప్రతిష్టపాలు కావడం మార్కెట్ల మీద చాలా ప్రభావం చూపించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles