Finally The Court Marathi Movie Is Chosen As India's Official Entry For Oscars | Bahubali Oscar | Srimanthudu Oscar | PK Oscar

Court marathi movie indias official entry for oscars bahubali srimanthudu pk

court movie, court marathi movie, oscar 88th nominations, oscar awards ceremony, best foreign film category, best academy awards, bahubali oscar news, srimanthudu oscar news, pk oscar news, masaan oscar news, bollywood oscar movies, telugu oscar movies, court movie oscar awards, Court Movie Oscars

Court Marathi Movie Indias Official Entry For Oscars Bahubali Srimanthudu PK : The critically acclaimed movie Court will be India’a official entry to Oscar. The film will compete in the Best Foreign Film category at the Academy awards to be held next year.

‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’ చిత్రాలకు ఝలకిచ్చిన ‘కోర్టు’

Posted: 09/23/2015 06:23 PM IST
Court marathi movie indias official entry for oscars bahubali srimanthudu pk

‘బాహుబలి’.. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన అద్భుత శిల్పం. అద్భుతమైన గ్రాఫిక్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడంతోపాటు తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా వ్యాప్తిచెందేలా చేసింది. లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడిన ఈ చిత్రం.. భుసన్ ఫెస్టివల్ ల్లోనూ ప్రదర్శనకు సిద్ధమవుతోంది. ఇక ‘శ్రీమంతుడు’ చిత్రం విషయానికొస్తే.. గ్రామాన్ని దత్తత తీసుకునే నేపథ్యంలో కొనసాగే ఆ సినిమా ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. టాలీవుడ్ లో సరికొత్త రికార్డులు సృష్టించడంతోపాటు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఇంతటి ఘనవిజయాలు సాధించిన ఈ రెండు చిత్రాలకు తాజాగా ‘కోర్టు’ ఝలకిచ్చింది. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా! ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

అసలు విషయం ఏమిటంటే.. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో 88వ ఆస్కార్ అవార్డుల ప్రధాన కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగానే ఉత్తమ విదేశీ భాషల చిత్రాల కేటగిరీలో జ్యురీ ఛైర్మన్, డైరెక్టర్ అమోల్ పాలేకర్ తన బృందంతో కలిసి తొలుత 30 భారతీయ చిత్రాలను పరిశీలించారు. వాటిల్లో తెలుగు చిత్రాలైన ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’.. తమిళం నుంచి ‘కాక్క ముట్టై’.. బాలీవుడ్ నుంచి ‘పీకే’, ‘హైదర్’, ‘మేరీకోమ్’, మసాన్.. మరాఠీ పరిశ్రమ నుంచి ‘కోర్టు’ ఇంకా తదితర చిత్రాలు వున్నాయి. అలా ఎంపిక చేసిన ఆ 30 సినిమాలను ‘ఎంపిక బృందం’ తొమ్మిది రోజులపాటు హైదరాబాద్ లో చూశారు. వాటిల్లో ఏది ఉత్తమ విదేశీ చిత్రంగా ఎంపిక చేయాలోనన్న తర్జనభర్జన చేసి.. చివరగా ‘కోర్టు’ చిత్రాన్ని ఎంపిక చేసినట్లు వివరించారు. 88వ ఆస్కార్ అవార్డుల ప్రధాన కార్యక్రమం కోసం భారత్ నుంచి ‘కోర్టు’ సినిమాను అధికారికంగా ఎంపిక చేసినట్లు అమోల్ పాలేకర్ బుధవారం వెల్లడించారు.

‘కోర్టు’ లోపల జరిగే సన్నివేశాలతో సాగే ఈ చిత్రాన్ని ప్రముఖ మరాఠీ దర్శకుడు చైతన్య తమనే రూపొందించారు. ముంబయి క్రిందిస్థాయి కోర్టులో ఓ వృద్ధ ఫోక్ సింగర్ కు సంబంధించిన కేసు వాదోపవాదాలతో ఈ చిత్రం ముందుకు సాగుతుంది. ఇప్పటికే ఈ చిత్రం జాతీయ అవార్డును గెలుచుకోగా.. తాజాగా ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’, ‘పీకే’, ‘మేరీ కోం’ వంటి చిత్రాలన్నింటిని వెనక్కి నెట్టేసి.. ఆస్కార్ కు నామినేషన్ పొందింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Court Marathi Movie  88th Oscar Ceremony  Bahubali Oscar  Srimanthudu Oscar  

Other Articles