Asaduddin Owaisi described a picture

Asaduddin owaisi described a picture

Digvijay singh, Photo, Diggi Raja, MIM, Owisis, Mohan Bhagat, RSS, Socila Media, Muslims

Asaduddin Owaisi described a picture. MIM president Asaduddin Owaisi on Wednesday described a picture posted by Congress leader Digvijaya Singh on Twitter, showing his (Owaisi's) half face with the other half of RSS chief Mohan Bhagwat as an insult to Muslims.

దిగ్విజయ్ అభ్యంతకర ఫోటో.. దుమారం

Posted: 09/24/2015 08:18 AM IST
Asaduddin owaisi described a picture

దిగ్విజయ్ సింగ్ ఒక ఫోటో సర్వత్రా చర్చకు దారి తీసింది. కాంగ్రెస్ సీనియర్ నేతగా ఎంతో రాజకీయ అనుభవం ఉన్న దిగ్విజయ్ సింగ్ పోస్ట్ చేసిన ఓ ఫోటో వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. దిగ్విజయ్ సింగ్ పోస్ట్ చేసిన ఫోటో మీద ఎంఐఎం పార్టీ అధినేత ఓవైసీ మండిపడుతున్నారు. తన సగం ముఖచిత్రాన్ని ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ సగం ముఖచిత్రంతో కలిపి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయ డంపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టోపీ ధరించి గడ్డంతో ఉన్న ఓ ముస్లింను ఆరెస్సెస్ నేత ఫొటోతో కలిపి ప్రదర్శించడం ముస్లిమ్‌లను అవమానించడమేనన్నారు.



దేశ సామాజిక నిర్మాణాన్ని ధ్వంసం చేస్తున్న ఇద్దరు మత మౌఢ్యులు అన్న వ్యాఖ్యతో దిగ్విజయ్‌సింగ్ ఆ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీనిపై ఒవైసీ స్పందిస్తూ తన ఫొటోకు ఎటువంటి ప్రాధాన్యం లేదని, కానీ ఆయన ఈ చర్యతో ముస్లింలను అవమానించారన్నారు. కాంగ్రెస్ పాలనలోనే అనేక మత కల్లోలాలు జరిగాయని గుర్తు చేశారు. బాబ్రీ మసీదును కూల్చివేసి, అందులో విగ్రహాలు పెట్టారని పేర్కొన్నారు. నరేంద్రమోదీని మీ పిల్లల వివాహాలకు ఆహ్వానిస్తారు కదా. ఆ ఫొటోలను ఎందుకు పోస్ట్ చేయరు? అని నిలదీశారు. మొత్తంగా ఒకే ఒక్క ఫోటోతో దిగ్విజయ్ సింగ్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే దిగ్విజయ్ ఉద్దేశంలో ఒకే ఫోటో ద్వారా మతఛాందస వాదాన్ని చూపిద్దామని అనుకున్నారేమో కానీ బెడిసి కొట్టింది. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఇలా చెయ్యడం ఏంటని కాంగ్రెస్ పార్టీలో చర్చసాగుతోందట.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Digvijay singh  Photo  Diggi Raja  MIM  Owisis  Mohan Bhagat  RSS  Socila Media  Muslims  

Other Articles