Chinese Beautiful Bride Gu Yan Yan Saved A Man Who Got Heart Attack While Swimming In Sea | Beautiful Chinese Bride

Chinese beautiful bride gu yan yan saved a man who got heart attack

chinese bride gu yan yan, chinese bride brave, chinese bride saved heart attack person, chinese nurses, chinese beautiful brides

Chinese Beautiful Bride Gu Yan Yan Saved A Man Who Got Heart Attack : Chinese Beautiful Bride Gu Yan Yan Saved A Man Who Got Heart Attack While Swimming In Sea With Her Braveness

ITEMVIDEOS: మునిగిపోతున్న ప్రాణాన్ని కాపాడిన పెళ్లికూతురు

Posted: 09/23/2015 03:52 PM IST
Chinese beautiful bride gu yan yan saved a man who got heart attack

ఏదైనా ఓ ఘటన జరుగుతున్నప్పుడు దానికి అనుకూలంగా వ్యవహరించాల్సిన స్థానిక ప్రజలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటారు. ప్రపంచంలో తమకంటే పెద్ద వీడియోగ్రాఫర్ లేనట్లుగా తమ మొబైల్ ఫోన్లలో సదరు ఘటనను చిత్రీకరిస్తుంటారు. ట్రెండ్ అటువంటిదిమరి! అయితే.. కేవలం కొద్దిమంది మాత్రం సదరు సందర్భాల్లో తమవంతు సహాయం అందించడంలో కృషి చేస్తారు. దాంతోవారు సామాజిక మాధ్యమాల్లో మనసున్న గొప్ప వ్యక్తులుగా వెలిగిపోతారు. ఈ తరహాలోనే ఓ పెళ్లికూతురు ఎంతో సాహసించి, ఓ ప్రాణాన్ని కాపాడి, ప్రపంచప్రజలకు నిదర్శనంగా నిలిచింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన గూ యాన్ యాన్ అనే యువతికి తనకు నచ్చిన వరుడితో మరికొద్దిసేపటిలో పెళ్లి జరగనుంది. ఆ సంతోష ఘడియల్ని ఆమె ఆనందంగా గడుపుతోంది. ఎంతో అందంగా మురిసిపోతూ సముద్రతీరంలో ఫోటోలకు పోజులిస్తూ.. కాబోయే వరుడితో సంతోషంగా వుంది. ఇంతలోనే అక్కడ ఓ సంఘటన చోటు చేసుకుంది. సముద్రంలో మునిగిపోతున్న ఓ వ్యక్తి ఆమెకు కనిపించాడు. స్విమ్మింగ్ చేస్తున్న అతనికి గుండెపోటు రావడంతో అచేతనంగా మారిపోవడాన్ని ఆమె గమనించింది. అంతే.. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అక్కడకు చేరుకుని నిమిషాల మీద అతన్ని ఒడ్డుకు చేర్చింది. కానీ అప్పటికే గుండె స్పందన ఆగిపోయింది. అప్పుడు ఆమె మరింత సమయస్ఫూర్తితో వ్యవహరించి సీపీఆర్ థెరపీ (గుండెకు కృత్రిమంగా స్పందనలు అందించే ప్రక్రియ) ప్రారంభించింది. దీంతో అతను మృత్యుముఖం నుంచి బయటపడ్డాడు. దీంతో ఇప్పుడామె ‘అత్యంత అందమైన, సాహసమైన పెళ్లికూతురి’గా సోషల్ మీడియాలో ప్రశంసలందుకుంటోంది. ఇంత సమయస్ఫూర్తిగా వ్యవహరించిన ఆ అందమైన పెళ్లికూతురు స్థానిక ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది.

చైనాలోని డాలియన్ సెంట్రల్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్న ఆ యువతి.. పెళ్లి సమయంలోనూ తన వృత్తి ధర్మాన్ని మర్చిపోకుండా ఒక ప్రాణాన్ని కాపాడింది. తన అనుభవాన్ని రంగరించి వ్యక్తి ప్రాణాలను కాపాడింది. దీనికి సంబంధించిన స్థానిక మీడియా.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. గూ యాన్ యాన్ పొగడ్తలతో ముంచెత్తేశారు. అందమైన పెళ్లికూతురంటూ వారి భాషలో కొనియాడారు. ఇక ఆమెను పెళ్లి చేసుకోబోతున్న వరుడు లీ చాంగ్ కూడా తన  ఫియాన్సీ సాహసానికి మురిసిపోయాడట. ‘నాకు చాలా గర్వంగా ఉంది.. నా కంటే వేగంగా పరిగెత్తి మరీ గూ ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడింది’ అంటూ పేర్కొన్నాడట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chinese bride gu yan yan  heart attack person  

Other Articles