Daniel Carder 45 Year Engineer Has Reveals For The First Of Volkswagen AG Cheating | Volkswagen Scam

Daniel carder 45 year engineer reveals volkswagen cheating case

daniel carder, engineer daniel carder, volkswagen scam, volkswagen cheating case, volkswagen scandal, volkswagen controversy, engineer daniel carder news, volkswagen daniel carder

Daniel Carder 45 Year Engineer Reveals Volkswagen Cheating Case : Daniel Carder 45 Year Engineer Has Reveals For The First Of Volkswagen AG Cheating.

వోక్స్ వాగన్ బండారాన్ని బయటపెట్టిన ఓ ఇంజనీర్

Posted: 09/23/2015 03:15 PM IST
Daniel carder 45 year engineer reveals volkswagen cheating case

వోక్స్ వాగన్.. ప్రపంచంలోని మోస్త్ పవర్ ఫుల్ కంపెనీల్లో ఒకటిగా పేరుగాంచిన సంస్థ. గత 15 సంవత్సరాల నుంచి కార్ల సర్వీస్ చేస్తున్న ఈ సంస్థ.. ప్రపంచ వాహన చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణానికి పాల్పడింది. తప్పుడు ధ్రువీకరణలతో పలు దేశాల ప్రభుత్వాలను మోసం చేయడంతోపాటు నమ్మకంతో కార్లను కొన్న కస్టమర్లను వంచిస్తూ వచ్చింది. ఈ సంస్థ తయారుచేసిన కార్ల ఇంజన్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని తేలింది. తొలుత ఈ విషయాన్ని కనుగొంది ఓ చిన్న ఇంజనీర్. వెస్ట్ వర్జీనియాకు చెందిన 45 సంవత్సరాల డేనియల్ కార్డర్ అనే ఇంజనీర్.. వోగ్స్ వాగన్ కారులో వున్న లోపాన్ని కనుగొన్నాడు. వోక్స్ వాగన్ చేస్తున్న దారుణ మోసాన్ని తొలుత వెలుగులోకి తీసుకొచ్చింది ఈయనే.

వెస్ట్ వర్జీనియా యూనివర్శీటీకి చెందిన ఐదుగురు సభ్యుల రీసెర్చ్ టీం 50 వేల డాలర్లు వెచ్చించి ఓ అధ్యయనం చేపట్టింది. అందులో భాగంగానే కార్డర్ వోక్స్ కార్ల లోపాన్ని పసిగట్టాడు. 2012లో ప్రారంభించిన తమ అధ్యయనం మే 2013లో పూర్తి చేశామని, అనంతరం ఆ వివరాలను ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ క్లీన్ ట్రాన్స్ పోర్టేషన్ విభాగానికి అందించామని ఆయన తెలిపారు. తన టీమ్ మెంబర్స్ అందరూ కలిసి.. లాస్ ఏంజిల్స్ నుంచి సియాటెల్ వరకూ వివిధ వాహనాలను పరిశీలించామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే వోక్స్ తయారు చేసిన కార్లలో ఒక వాహనం 15 నుంచి 35 రెట్ల వరకూ కర్బన ఉద్గారాలు విడుదల చేయగా, అదే మోడల్ కు చెందిన మరో కారు 10 నుంచి 20 రెట్ల కాలుష్యాన్ని వెదజల్లిందని.. అప్పుడే తమకు అనుమానం వచ్చి మరింత లోతుగా పరిశోధనలు చేశామని వివరించారు. తొలుత ఫ్యూయల్ ఇంజక్షన్ వ్యూహంలో జరిగిన మార్పుల కారణంగా ఇలా అయి ఉండవచ్చని, మరింత మైలేజీ కోసం కస్టమర్ స్వల్ప మార్పులు చేయించుకుని ఉంటారని భావించినట్లుగా తెలిపారు. కానీ.. అలాంటిదేమీ లేదని తమ పరిశోధనల్లో వెల్లడైనట్లుగా ఆయన పేర్కొన్నారు.

తమ అధ్యయనం వివరాలను ప్రజల కోసం బహిరంగ పరిస్తే, వోక్స్ వాగన్ తప్పుబట్టిందని, సంస్థ పరువు తీసేందుకు ఇలా తప్పుడు స్టడీ చేశారని దుయ్యబట్టిందని తెలియజేశారు. ఆ తరువాత యూరోపియన్ కమిషన్ తో కలసి సంయుక్త రీసెర్చ్ చేశామని, వోక్స్ కార్లలో టెస్ట్ రిజల్ట్స్, రోడ్లపై కారు పనితీరులో సమూల మార్పలు వున్నట్లు గమనించామని అన్నారు. వోక్స్ మార్కెటింగ్ చేస్తున్న ‘పస్సాట్’, ‘జెట్టా’లతోపాటు బీఎండబ్ల్యూ ఎక్స్-5పై రీసెర్చ్ చేయగా, బీఎండబ్ల్యూ పనితీరు సంతృప్తికరంగా ఉందని వివరించారు. అమెరికన్ నిబంధనలను ఈ కార్లు పాటించడం లేదని తాము గుర్తించిన లోపం ఇంత పెద్ద సంచలనం అవుతుందని ఎంతమాత్రం ఊహించలేదని కార్డర్ వ్యాఖ్యానించారు. తమపై ప్రశంసల వర్షం కురుస్తుండటంతో ఆయన హర్షం వ్యక్తం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : engineer daniel carder  volkswagen scam  

Other Articles