చేయాలో తెలియడం లేదా..? మరికెందుకు ఆలస్యం వెంటనే మా యూనివర్శిటీలో చేరండి అంటూ ఆహ్వానం పలుకింది చైనాలోని ఓ యూనివర్శిటీ. డేటింగ్, ఫ్రెండిషిప్ కోర్సులను ప్రవేశపెడతూ.. యువతకు శిక్షణ ఇస్తామంటూ ప్రకటనలు జారీ చేసింది. థీయరి ఆఫ్ లవ్ పేరుతో కొత్త కోర్సును ప్రవేశ పెడుతోంది... ఉత్తర చైనాలోని తియాన్జిన్ యూనివర్సిటీ. ఈ కోర్సు లో చేరిన వారికి లవర్‌ను ఎలా ఎంచుకోవాలో నేర్పిస్తారు. ఈ కోర్సు పూర్తి పేరు థీయరి ఇన్ లవ్ అండ్ డేటింగ్. వచ్చే ఏడాదినుంచి ప్రేమ పాఠాల కోర్సు ప్రారంభమవుతుంది. ఇందులో చేరిన విద్యార్ధులు తమ చదువు పూర్తయిన తర్వాత పార్ట్‌నర్ ను పొందగలిగినప్పుడే వారికి ఫుల్ మార్కులు వేస్తారు.
చర్చలు, సామాజిక కార్యక్రమాల్లో విద్యార్ధులు పాల్గొనేటట్టు చేసి వారికి డేటింగ్‌లో శిక్షణ ఇస్తారట. క్లాసులో టీచర్ నిలబడి పాఠాలు చెప్పడం విద్యార్ధులు దాన్ని వినడం వంటి పాత పద్దతిలో కాకుండా పూర్తిగా ఇంటరాక్టివ్ సిస్ట్‌మ్ లో ఈ కోర్స్ ఉంటుంది. విద్యా సంస్కరణల్లో భాగంగా ఈ కోర్సును ప్రవేశపెట్టినట్టు తియాన్జిన్ యూనివర్సిటీ అధికారులు చెప్తున్నారు. తియాన్జిన్ విశ్వవిద్యాలయం చైనాలోని టాప్ యూనివర్సిటీల్లో ఒకటి ఇందులో 25 వేలమందికి పైగా విద్యార్ధులున్నారు.
చైనా రాజధాని బీజింగ్ లో తియాంజిన్ యూనివర్సిటీ డేటింగ్ లో ప్రత్యేకమైన కోర్సును ప్రవేశపెట్టింది. డేటింగ్ తో పాటు మేకింగ్ ఫ్రెండ్స్ అనే కోర్సు కూడా ఉంది. ఈ కోర్సులో ధియరీతో పాటు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయని వారు వెల్లడించారు. ఈ కోర్సులో 32 గంటల పాటు క్లాసులు ఉంటాయి. కోర్సు అన్నాక పరీక్షలు కూడా సాధారణం, అందుకే రెండు క్రెడిట్లు రూపొందించారు. ఈ రెండిటిలో పాస్ అయితే డేటింగ్ కు అర్హత సాధించినట్టే. అబ్బాయిలు, అమ్మాయిల్లో ఎవరు బాగా అర్ధం చేసుకుంటారో వారికి ఎక్కువ మార్కులు వస్తాయని కోర్సు డైరెక్టర్ కాంగ్ ఇంగ్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more