సామాజిక మాధ్యమం అయిన ‘ఫేస్ బుక్’ ఈమధ్య ‘ఫేక్’ అకౌంట్ల రాద్ధాంతం తారాస్థాయికి చేరిపోతోంది. తమ అభిమాన తారల పేరుతో నకిలీ పేజీలు క్రియేట్ చేయడం, వాళ్లతో దిగిన ఫోటోలను తమకిష్టం వచ్చినట్లుగా వాడుకోవడం లాంటివి చేస్తున్నారు. అంతేకాదు.. ఇతర హీరోల ఫోటోలతో పోల్చుతూ సెటైర్లు వేయడం మరీ ఎక్కువైంది. ఇక కొంతమంది హేటర్స్ అయితే హీరోల ఫోటోలకు జంతువులకు అటాచ్ చేసి పేరడీలు క్రియేట్ చేస్తున్నారు. నెటిజన్లు కూడా ఈ విధమైన సంస్కృతికి బాగా అట్రాక్ట్ కావడంతో ‘ఫేక్’గాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. ఇలా ఈ విధంగా ‘ఫేక్’ అకౌంట్ల బారిన పడిన తారలు ఎందరో వుండగా.. తాజాగా సల్మాన్ ఖాన్ కూడా చేరిపోయాడు.
‘ఫేస్ బుక్’లో సల్మాన్ పేరిట ఎన్నో ఫేక్ పేజీలు క్రియేట్ చేయబడి వున్నాయి. ఆయా పేజీల్లో సల్మాన్ ఫోటోలను తమకిష్టమొచ్చినట్లుగా అభిమానులు వాడుకుంటున్నారు. మరొక ‘ఫేక్’ ఘనుడు అందరికంటే ఓ అడుగు ముందుకేసి.. సల్మాన్ త్వరలోనే ఓ సినిమాకి సంబంధించి కాస్టింగ్ చేయనున్నాడని పోస్ట్ చేశాడు. ఈ విషయాన్ని ఎలోగోలా తెలుసుకున్న సల్మాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సామాజిక మాధ్యమంలో తన పేరిట్ ఎవరో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారని, తన ఫోటోలను దుర్వినియోగం పరుస్తున్నారని, ఇలా చేయడం తగదని సల్మాన్ వార్నింగ్ ఇచ్చాడు. అలాగే.. త్వరలోనే తాను సినిమాలో నటిస్తున్నానని, అందుకు సంబంధించి కాస్టింగ్ నిర్వహిస్తున్నట్లుగా పేర్కొనబడిన విషయంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశాడు.
‘నేను ఓ సినిమాలో నటిస్తున్నానని, ఆ ప్రాజెక్ట్ కోసం కాస్టింగ్ నిర్వహిస్తున్నానని ఓ నకిలీ ఫేస్బుక్ పేజీలో రాశారు. అయితే.. తాను గానీ, తన మేనేజర్లు గానీ ఎలాంటి కొత్త ప్రాజెక్టుకు ఆమోదం తెలపలేదు. ఇక కొంతమంది నాతో కలిసి దిగిన ఫొటోలను దుర్వినియోగం చేస్తున్నారు. ఇది ఏమాత్రం సరికాదు.. నాకు ఆమోదయోగ్యం కాదు’ అని బుధవారం ఉదయం సల్లూ భాయ్ ట్వీట్ చేశాడు.
(And get your daily news straight to your inbox)
Aug 13 | తన బిడ్డ అపదలో ఉన్నాడంటే ప్రతీ తల్లి గజేంద్రమోక్ష ఘట్టంలోని శ్రీమహావిష్ణువు రూపం దాల్చి అత్యంత వేగంగా ప్రతిస్పందించి రక్షిస్తుందని అంటారు. తన బిడ్డకు ఆపద వస్తుందంటే అవసరమైతే పులితో కూడా పోట్లాడి.. తన... Read more
Aug 13 | బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే చేసిన తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు పోందాలంటే యువకులు లంచం ఇవ్వాలి.. యువతులైతే మరో రకంగా సహకరించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రియాంఖ ఖార్గే... Read more
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more