TDP Senior leader Errabelli said sorry in telangana aseembly

Errabelli said sorry in telangana aseembly

Errabelli, Errabelli Dayakar Rao, Abdul Kalam, Telangana, Assembly, KCR, AP, Telangana state

TDP Senior leader Errabelli said sorry in telangana aseembly. Telanagan TDP senior leader use andhrapradesh word instead of telangana.

అసెంబ్లీలో అందరికి Sorry చెప్పిన ఎర్రబెల్లి

Posted: 09/23/2015 11:40 AM IST
Errabelli said sorry in telangana aseembly

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాంకు నివాళినర్పిస్తూ సభలో సంతాప  తీర్మానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు.  అయితే అన్ని పార్టీల నాయకులు కేసీఆర్ పెట్టిన సంతాన తీర్మానాన్ని బలపరుస్తూ అబ్దుల్ కలాం గురించి నాలుగు మాటలు మాట్లాడారు. అయితే అబ్దుల్ కలాం గురించి తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు సభలో మాట్లాడారు. అయితే అంతా అయిపోయాక చివర్లో ఓ చిన్న తప్పు చెయ్యడంతో సభలో నవ్వుల పువ్వులు పూచాయి. తర్వాత తాను కూడా నవ్వుకొని.. సభలో Sorry చెప్పారు. అంతలా ఎర్రబెల్లి ఏం తప్పు చేశారు అనేగా మీ అనుమానం అయితే మొత్తం స్టోరీ చదవండి.

Also Read : నేటి నుండి అసెంబ్లీలో సమరమే..

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సంతాప తీర్మానానికి మద్దుతు పలుకుతూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు సభలో మాట్లాడారు. అబ్దుల్ కలాం సేవలు దేశానికి చిరస్మరణీయమని.. దేశానికి అలాంటి గొప్ప వ్యక్తి రాష్ట్రపతిగా పని చెయ్యడం ఎంతో గర్వకారణంగా ఉందని వెల్లడించారు. తమ అధినేత చంద్రబాబు నాయుడు అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసిన ఘనత దక్కిందని అందుకు గర్వపడుతున్నామని అన్నారు. అలాంటి వ్యక్తి లేని లోటు తీర్చలేమని.. మరో జన్మలో ఆంధ్రప్రదేశ్ లోనే పుట్టాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ మాటెత్తడం అందరికి నవ్వు తెప్పింది. దాంతో తన తప్పును క్షమించాలని అందరిని కోరారు.

Also Read : కేసీఆర్ బట్టలూడదీసే పాట.. వింటే షాక్


*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Errabelli  Errabelli Dayakar Rao  Abdul Kalam  Telangana  Assembly  KCR  AP  Telangana state  

Other Articles