Where is Hardik patel

Where is hardik patel

Hardik Patel, Gujarat, Reservations, Surat, Police, Habeas corpus petition, court

Hardik Patel, who is leading an agitation for reservation for the Patel community in Gujarat, must be produced before a court by Thursday, the state government was told late last night.

హార్దిక్ పాటిల్ పారిపోయాడా.? బందీగా ఉన్నాడా..?

Posted: 09/23/2015 12:00 PM IST
Where is hardik patel

హార్దిక్ పాటిల్.. తక్కువ కాలంలో హీరోగా ఎదిగిన నాయకుడు. గుజరాత్ కు చెందిన పటేల్ సామాజిక వర్గానికి చెందిన హార్దిక్ పాటిల్ గత కొంత కాలంగా తమకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని.. తమను ఓబీసీ కోటాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్క గుజరాత్ లోనే కాదు  చాలా ప్రాంతాల్లో అక్కడ ఉంటున్న స్థానిక వెనుకబడిన ఉన్నత వర్గాల వారితో మీటింగ్ లు నిర్వహిస్తూ.. దేశంలో ఉన్న రిజర్వేషన్ వ్యవస్థ మీద యుద్దానికి సిద్దమవుతున్నారు. అయితే సూరత్ లో ఏక్తార్యాలీలో పాల్గొన్న హార్దిక్ పాటిల్ ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. కానీ ఆ తర్వాత హార్దిక్ ఏమయ్యాడు అన్న దాని మీద చర్చ మొదలైంది. హార్దిక్ మిస్సింగా..? అంటూ సాగుతున్న చర్చలు టెన్షన్ ను క్రియేట్ చేస్తున్నాయి.

Also Read : హార్దిక్ పాటిల్ ను నడిపిస్తున్న ఆ మూడక్షరాలు..!

ఏక్తా ర్యాలీ నిర్వహించాలని సూరత్ కి హార్దిక్ చేరుకున్నారు. అక్కడ స్థానికంగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూల మాల వేసి తర్వాత ర్యాలీకి సన్నదమయ్యారు. తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు హార్దిక్ ను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఏ మీడియాలోనే హార్దిక్ కు సంబందించిన వివరాలు బయటకు వెల్లడికాలేదు. అయితే తాజాగా కొత్త డ్రామా మొదలైంది. హార్దిక్ పాటిల్ తమ అదుపులోంచి తప్పించుకున్నారని.. కొంత మంది పోలీసులు అంటున్నట్లు సమాచారం. అయితే హార్దిక్ అభిమానులు మాత్రం హార్దిక్ ను బందించారని అంటున్నారు. ఇదే నేపథ్యంలో హార్దిక్ కనిపించకుండా పోవడం మీద కోర్ట్ లో పిటిషన్ దాఖలైంది. దాంతో రేపటిలోగా హార్దిక్ పాటిల్ ను కోర్ట్ లో ప్రొడ్యూస్ చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. మరి ఏం జరగబోతోందో చూడాలి.

Also Readఇక తాడో పేడో తేలిపోవాలంటున్న హార్దిక్ పాటిల్


*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hardik Patel  Gujarat  Reservations  Surat  Police  Habeas corpus petition  court  

Other Articles