Rahul Gandhi Went For Another Secret Tour Which Become Interest | Colorado Conference | Rahul Gandhi Secret Tour

Rahul gandhi another secret tour controversy conferences colorado

rahul gandhi, rahul gandhi secret tour, congress party news, congress updates, rahul secret abroad tour, sonia gandhi, congress controversies

Rahul Gandhi Another Secret Tour Controversy Conferences Colorado : Rahul Gandhi Went For Another Secret Tour Which Become Interest.

మరోసారి రహస్యంగా దేశం వదిలిన రాహుల్ గాంధీ

Posted: 09/23/2015 11:18 AM IST
Rahul gandhi another secret tour controversy conferences colorado

రాహుల్ గాంధీ.. ఎప్పుడేం చేస్తారో ఆయనకే తెలీదని మరోసారి నిరూపితమైందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అత్యవసరమైన సందర్భాల్లో కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం, వేళ కాని వేళలో ర్యాలీలు నిర్వహించడం, పొంతనలేని మాటలు మాట్లాడటం ఆయనకే చెల్లుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే.. ఆయన మరోసారి రహస్య పర్యటనకు వెళ్లిపోయారని సమాచారం. అందుకే.. ఆయన మరోసారి వార్తల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిపోయారు.

గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో అత్యంత ముఖ్యమైన బడ్జెట్ సమావేశాల సందర్భంలో రాహుల్ గాంధీ ఒక్కసారిగా అదృశ్యమైన సంగతి తెలిసిందే. అప్పుడు యావత్ దేశాన్ని ‘రాహుల్ గాంధీ ఎక్కడున్నారు?’ అనే ప్రశ్న గందరగోళ వాతావరణాన్ని ఏర్పరచింది. ఆయనకు సంబంధించి రెండుమూడు ఫోటోలు ఆమధ్య ట్విటర్ లో కనిపించాయే తప్ప.. ఆయన ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా వున్నాడు, తిరిగి ఎప్పుడొస్తాడు అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు. అయితే.. 56 రోజుల తర్వాత ఒక శుభదినాన ఆయన ఢిల్లీకి చేరుకోవడం.. ఆ తరువాత పదునుపెట్టిన బాణంలా బీజేపీపైకి దూసుకెళ్తుండటం.. అంతా జరిగిపోయింది. అనంతరం రైతు భరోసా పేరిట తెలుగు రాష్ట్రాల్లో పర్యటనలు, మరికొన్ని ప్రాంతాల్లో ప్రసంగాలు నిర్వహించారు. ఆయన అజ్ఞాతంలో నుంచి తిరిగొచ్చారు కానీ.. అన్ని రోజులు ఎక్కడున్నదన్న విషయం ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయింది. ఈ మిస్టరీ అందర్నీ ఇంకా ఆలోచింపచేస్తుండగానే.. సరిగ్గా అలాంటిదే మరో పర్యటనను రాహుల్ చేపట్టారు. అవును.. ఆయన దేశాన్ని వదిలి మరో రహస్య పర్యటనకు వెళ్లారు.

అయితే.. ఈ సారి ఆయన వెళ్లిన దేశం పేరు, ప్రదేశం వెల్లడైందికానీ అక్కడ ఎన్నిరోజులు ఉంటారు, ఎప్పుడొస్తారనే వివరాలను గోప్యంగా ఉంచారు. కొలరాడోలోని ఆస్పెన్ లో ఓ కాన్ఫరెన్స్ జరగనున్నదని, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే నాయకులతోపాటు రాహుల్ గాంధీ కూడా ఆ కాన్ఫరెన్స్ లో పాల్గొంటారని తెలిసింది. ఇంతవరకు బాగానే వుంది కానీ.. ఆ సదస్సు ఏ రోజు జరుగుతుందనేది మాత్రం తెలియరాలేదు. రాహుల్ అమెరికా వెళ్లారని, త్వరలోనే ఆయన తిరిగొస్తారని, వచ్చీరాగానే బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా మంగళవారం మీడియాకు చెప్పారు. కాన్ఫరెన్స్ ఏ తేదీన జరుగుతుంది? ఎవరు నిర్వహిస్తున్నారు? రాహుల్ మళ్లీ ఇండియాకు ఎప్పుడు తిరిగొస్తారు? ఇది మరో దీర్ఘకాలిక సెలవా? అనే మీడియా ప్రశ్నలకు సుర్జేవాల్ బదులు చెప్పకపోవడం.. రాహుల్ రహస్య పర్యటనను మరింత ఆసక్తికరంగా మార్చింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi secret tour  congress controversies  

Other Articles