chinese man divorces wife after winning lottery

Husband from china divorces wife after winning lottery

affair, extramarital affair, sex outside marriages, bizarre sex stories, Liu Xiang, lottery, in China's Chongqing city, 4.6 million yuan, 1.15 million yuan

A man in China's Chongqing city who won 4.6 million yuan ($721,987) in a lottery divorced his wife the day before he received the money

అదృష్టలక్ష్మి వరించగానే గృహలక్ష్మిని వదిలేసాడు..

Posted: 09/15/2015 09:49 PM IST
Husband from china divorces wife after winning lottery

ఇన్నాళ్లు మథ్యస్థ కుటింబికుడిగా జీవనం సాగిస్తున్న అతగాడికి లాటరీలో అదృష్టలక్ష్మి వరించింది, అంతలా డబ్బు ఎవరైనా వస్తే ఏం చేస్తారు? పెద్దమొత్తంలో వచ్చిన డబ్బును తన భార్య పిల్లలతో కలసి విలాసవంతమైన జీవితం గడపాలని ప్రణాళిక రచించి తదనుగూనంగా వెచ్చిస్తుంటారు. కాస్తా కూస్తే మొత్తాన్ని దాన దర్మాల కోసం పక్కనపెడతారు. కానీ ఈ భర్త మాత్రం అందుకు బిన్నంగా వ్యవహరించి అంతర్జాతీయంగా చర్చనీయాంశ వ్యక్తిగా మారాడు. అదృష్ట లక్ష్మీ వరించగానే గృహలక్ష్మీని వదిలేశాడు. అర్థంకాలేదా..? తనకు లాటరీ తగిలిందని తెలియగానే తన భార్యకు విడాకులిచ్చాడు.

చైనాలోని చాంగ్ కింగ్ నగరంలో ఈ వింత ఉదంతం వెలుగుచూసింది. లియు జియాంగ్ కు లాటరీలో 4.6 మిలియన్ యువాన్లు( భారత కరెన్సీలో దాదాపు రూ.4.7 కోట్లు) వచ్చాయి. ఈ మొత్తాన్ని తీసుకోవడానికి ఒకరోజు ముందు అతడు తన భార్య యువాన్ లీకు విడాకులిచ్చాడు. ఫిబ్రవరి 26న అతడు లాటరీ సొమ్ము అందుకున్నాడు. అయితే అసలు విషయం తెలసుకున్న భార్య.. తనతో సంసార జీవితం సాగిస్తున్న క్రమంలోనే తన భర్త లాటరీ టిక్కెట్ కోన్నాడని.. ఈ నేపథ్యంలో తనకు విడాకులు ఇచ్చేడే కానీ, తన ఆస్తిలో వాటా ఇవ్వలేదని డిమాండ్ చేస్తూ లియు జియాంగ్ భార్య కోర్టుకెక్కింది. కోర్టు ఆదేశాలకు మేరకు 1.15 మిలియన్ యువాన్లు భార్యకు ఇవ్వాల్సివచ్చింది. భార్యతో విడిపోవడానికి ముందే లియు జియాంగ్ కు మరో మహిళతో సంబంధముందని తేలింది

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lottery  4.6 million yuan  husband divorces wife  Liu Xiang  chomgquing city  china  

Other Articles