Isis: Extremists release alarming new video on 9/11 anniversary

We are back in america isis releases chilling new video on 9 11 anniversary

We are back in America, ISIS releases chilling new video, 9/11 anniversary, ISIS threaten fresh attacks on US, ISIS 10 minute video, ISIS VIDEO ON 9/11, Back, America, ISIS, Releases, Chilling, Video, 9/11, Anniversary, September 11 Attacks, United States Of America, Warns, Cars, Full, Explosives,

We are back in America': ISIS releases chilling new video on 9/11 anniversary where extremists threaten fresh attacks on the US. 10 minute video, claiming to be by ISIS, warns of 'cars full of explosives

ITEMVIDEOS: ఆ తరహా గాయాన్ని మళ్లీ రేపుతాం.. అమెరికాకు ఐఎస్ హెచ్చరికలు

Posted: 09/15/2015 09:05 PM IST
We are back in america isis releases chilling new video on 9 11 anniversary

14 ఏళ్లు గడిచినా.. ఆ గాయం రేపిన విధ్వంసక ఘటనలను, ఇంకా అమెరికన్లు మరువలేదు. అమెరికాలోనే అత్యంత పొడువైన వరల్డ్ ట్రేడ్ టవర్స్ ను విమానాలతో కూల్చివేసిన ఘటనలో.. తమ వారిని పోగొట్టుకున్న ఎందరో అమెరికన్లు.. వారికి ఇటీవలే స్మరించుకుని ఘనంగా శ్రద్దాంజలి ఘటించారు. అయితే అదే తరహా ఘటనలను పునరావృతం చేస్తామని తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ అఫ్ ఇరాక్ అండ్ సిరియా హెచ్చరించింది. అమెరికాను వణికించిన 9/11 దాడులను పునరావృతం చేస్తామని, తాజాగా విడుదల చేసిన వీడియోలో ‘వీ అర్ బ్యాక్ ఇన్ అమెరికా’లో స్పష్టం చేసింది.



అగ్రరాజ్యంలో విధ్వంసం సృష్టించేందుకు తాము పేలుడు పదార్థాలను నింపిన కార్లను, మానవ బాంబులను అమెరికాలోకి పంపిస్తామని ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదులు తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో హెచ్చరించారు. 2001, సెప్టెంబర్ 9న దాడులు జరిగి 14 ఏళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ వీడియోను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు రూపొందించారు. వెనకాల వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లు కూలిపోతున్న దృశ్యాల ముందు కూర్చొని ఒసామా బిన్ లాడెన్ అమెరికాను ఉద్దేశించి చేసిన హెచ్చరికలను కూడా వీడియోలో పొందుపర్చారు.

అమెరికన్లను, యూదులు, క్రైస్తవులను ప్రతి ముస్లిం ద్వేషించే రోజులు వస్తాయని, ఈలోగా ప్రపంచంలోని జిహాదీలంతా ఏకం కావాలని ఐఎస్‌ఐఎస్ టైస్టులు వీడియోలో పిలుపునిచ్చారు. ‘అల్లా సైనికులం సిద్దంగా ఉన్నాం’ అనే మార్చింగ్ సాంగ్‌తో జీపుల్లో టెర్రరిస్టులు వెళుతున్న దృశ్యాలు కూడా వీడియోలో ఉన్నాయి. సెప్టెంబర్ దాడులను పునరావృతం చేస్తామంటూ రెండు ట్విట్టర్ ఖాతాల ద్వారా కూడా టెర్రరిస్టులు హెచ్చరించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amercia  isis  9/11 attacks anniversary  threatening video  

Other Articles