Air India Likely to Ground 125 Overweight staff

Air india likely to ground 125 overweight cabin crew members

AIr India, Overweight, Cabin Crew Members, airhostesses,aviation regulator Directorate General of Civil Aviation

Air India is likely to ground around 125 cabin crew, including airhostesses, for their failure to maintain weight requirements as prescribed by aviation regulator Directorate General of Civil Aviation (DGCA).Some of them may be assigned ground duty, while others can be offered voluntary retirement, Air India sources said.

నాజూగ్గా లేరని జాబుల నుండి తీసేశారు

Posted: 09/15/2015 10:40 AM IST
Air india likely to ground 125 overweight cabin crew members

అవును.. మీరు చదివింది నిజమే. చూడడానికి నాజూగ్గా. తీగలాగా లేరని అందుకే ఉద్యోగాల నుండి తీసివేస్తున్నట్లు వచ్చిన ప్రకటన అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇంతకీ ఎంత మందిని ఉద్యోగాల నుండి తొలగించారో తెలుసా.. ?125 మందిని ఉద్యోగాల నుండి తొలగించారు. తొలగించింది కూడా ఎయిర్ ఇండియా సంస్థ. ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఈ సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో 125 మంది ఎయిర్ హోస్టెస్ లు రోడ్డున పడ్డారు. అయితే నాజూగ్గా లేరని ఎలా తొలగిస్తారు అనే ప్రశ్న కూడా వెయ్యలేని పరిస్థితి ఉంది. అవును అలా ప్రశ్నించే అవకాశం లేకుండా ఎయిర్ ఇండియా అన్ని జాగ్రత్తలూ తీసుకుంది. ఒక్క ఎయిర్ ఇండియానే కాదు మిగిలిన ఏవియేషన్ సంస్థలు కూడా ఇలాంటి జాగ్రత్తలనే పాటిస్తున్నాయి.

విమానాశ్రయానికి వెళితే  చాలు మెరికల్లాంటి అందమైన ఆడవాళ్లు మెరుపు తీగల్లాగా కదులుతూ కనిపిస్తారు. ఎయిర్ వేస్ లలో పనిచేసే ఎయిర్ హోస్టెస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాలు అంటేనే అందానికి ముడిపడిన జాబులు. అందుకే అందంగా ఉన్న ఆడవాళ్లనే ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాలకు సెలక్ట్ చేస్తారు. అయితే అలా అందంగా ఉన్న వాళ్లనే ముందు ఉద్యోగాల్లోకి తీసుకున్నా.. ఉద్యోగంలోకి చేరిన తర్వాత చాలా మంది ఆడవాళ్లు లావెక్కుతున్నారు. దాంతో ఏం చెయ్యాలో పాలుపోని విమానయాన సంస్థలు.. ఎయిర్ హోస్టెస్ లు బరువు తగ్గాలని. నాజూగ్గా కనిపించాలని నోటీసులు జారీ చేసింది. ఉద్యోగం పొందే సమయంలో కూడా వారి అందం తగ్గనా.. లావెక్కినా.. లేదంటే మరో కారణాలతోనైనా ఉద్యోగం నుండి తొలగించేందుకు ఎయిర్ వేస్ కు అవకాశం కల్పిస్తూ.. అగ్రిమెంట్ మీద సంతాకాలు చేయించుకుంటారు. అలాగే ఎయిర్ ఇండియా కూడా గతంలోనే లావుతగ్గాలని నోటీసులిచ్చినా కానీ పట్టించుకోకపోవడంతో.. చివరకు వారి జాబులు ఊడాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles