There is no free wifi in Hyderabad

There is no free wifi connections in hyderabad

Free Wifi, Hyderabad, Tankbund, Charminar, MGBS, Hitech city

There is no free wifi connections in Hyderabad. Telangana govt proudly presnted free wifi services, but with in the short time Wifi services not working properly.

వైఫై ఫ్రీ అంటారు కానీ ఇవ్వరు

Posted: 09/14/2015 01:10 PM IST
There is no free wifi connections in hyderabad

తెలంగాణను డిజిటల్ తెలంగాణగా మార్చేక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వైపైని అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ లాంటి నగరాల్లో చాలా చోట్ల ప్రజలకు ఫ్రీగా వైఫై అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసింది. అందులో భాగంగా చాలా చోట్ల ఫ్రీగా అరగంట పాటు వైఫైని ఉచితంగా వాడుకునేందుకు అవకాశాన్ని కల్పించింది. ఒకవేళ అరగంట తర్వాత కావాలంటే తక్కువ ధరలోనే వైఫై సేవలను పొందవచ్చు. అయితే హైదరాబాద్ లో చార్మినార్, ట్యాంక్ బండ్, హైటెక్ సిటి లాంటి చాలా ప్రాంతాల్లో వైఫై సేవలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రుల చేత వైఫై సేవలను ఇనాగరేషన్ చేయించారు. కానీ ఆరంభ శూరత్వం తరహాలో ముందు బుసలు కొట్టినా తర్వాత మాత్రం తుస్సుమంది.

చార్మినార్ వద్ద.. ట్యాంక్ బండ్ మీద.. హైటెక్ సిటి దగ్గర ఎక్కడైనా సరే ఫ్రీగా వైఫై ఉంది కదా అని స్మార్ట్ ఫోన్ తీసి  వైఫై కనెక్ట్ చేసి వాడుకుందాం అనుకుంటే అది ఖచ్చితంగా మీరు నిరాశ చెందాల్సిందే. ఎందుకంటే వైఫై కనెక్టివిటి ఎంతకీ కాదు. ఎంతసేపు మీరు ఎదురు చూసినా కానీ కళ్లు కాయలు కాయాల్సిందే కానీ అంతకు మించి వైఫై మాత్రం అస్సలు కనెక్ట్ కాదు. ట్యాంక్ బండ్ మీద వైఫై సేవలను వాడుకునేందుకు వచ్చే వారికి... ఉంది కదా అని అనుకున్న వారికి నిజంగా నిరాశే మిగులుతోంది. మరి సిటిలో ఇంకా ఎక్కడైనా వైఫై సేవలు ఉన్నాయా అంటే ఎక్కడా కనిపించడం లేదు. తాజాగా ఎంజీబియస్ లో 5జి వైఫై సేవలను అందుబాటులోకి తెచ్చారు. మరి కనీసం ఇక్కడైనా సరిగ్గా పనిచేస్తే తెలంగాణ సర్కార్ కు దండాలు పెట్టేవాళ్లు చాలా మందే ఉన్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Free Wifi  Hyderabad  Tankbund  Charminar  MGBS  Hitech city  

Other Articles