Baahubali ganesh idols

Idols of the lord ganesh will be seen inspired by the movie s titular role

Ganesh, Vinayaka idols, Ganesh Chathurthi, Ganesh Chavithi, Baahubali, Baahubali Ganesh

idols of the lord Ganesh will be seen inspired by the movie's titular role. When the mega film Bahubali was the flavour of the season until recently, with just about everyone talking about it, how could the ‘lord of new beginnings’ be left behind?

బాహుబలి గణేశుడు.. సెల్ఫీ గణేశుడు

Posted: 09/14/2015 11:46 AM IST
Idols of the lord ganesh will be seen inspired by the movie s titular role

పుర్రెకో బుద్ది.. జిహ్వకో రుచి అని ఓ నానుడి. ఎవరికి నచ్చింది వారికి ఉంటుంది. పక్క వారికి మన టేస్ట్ నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. అయితే వినాయకుల చవితికి ప్రతిసారి నడుస్తున్న లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గట్టుగా గణేశుడి రూపాలు దర్శనమివ్వడం మామూలే. గతంలో ఎన్నికల సమయంలో మోదీ ఓరియెంటెడ్ గా గణేశులు రాగా, వరల్డ్ కప్ టైంలో క్రికెట్ నేపథ్యంలో గణేశుడు దర్శనమిచ్చాడు. మారుతున్న ట్రెండ్ కు తగ్గట్టుగా డిఫరెంట్ గా బొజ్జ గణపర్ దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తున్నాడు. ఇక తెలుగు నాట గణేశుడికి సినిమాలకు చాలా దగ్గరి రిలేషన్ ఉంటుంది. సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలియదు కానీ.. వినాయక చతుర్థి మీద మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది. సినిమాలంటే పడిచచ్చే తెలుగు వారు తమ బొజ్జ గణపయ్యను తమకు నచ్చిన విధంగా రూపుదిద్దుకుంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో చాలా గణపతి రూపాలు సినిమా స్టైల్లో ఉంటున్నాయి. అయితే తాజాగా భారీ అంచనాలతో విడుదలై, తెలుగు సినిమా కీర్తి పతాకాలను మరింత విశ్వవ్యాపితం చేసిన బాహుబలి ట్రెండ్ నడుస్తోంది. ఈ వినాయక చవితి నాడు గణేశుడిని కూర్చోబెట్టే వాళ్లు సినిమా స్టైల్లో గణేశుడిని తీసుకువెళ్లాలని అనుకుంటున్నారు. అందుకే బాహుబలి స్టైల్ గణేశుడు చాలా చోట్ల కనిపిస్తున్నాడు. శివలింగాన్ని ఎత్తుకున్న బాహుబలి లాగా బొజ్జ కనిపిస్తూ అందరికి కనువిందే చేస్తున్నారు. యుద్దానికి వెళుతున్న బాహుబలి స్టైల్... రాజుగా బాహుబలి ఇలా రకరకాల స్టైల్లో గణేశుడు అందరిని అలరిస్తున్నారు. ఇక టెక్నాలజీని ఇష్టపడేవాళ్లు టెక్నాలజీ ట్రెండ్ ను ఫాలోఅవుతుంటారు. అలాంటి వారి కోసం సెల్ఫీ గణేశుడి రూపాలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మొత్తానికి మరో మూడు రోజుల్లో వినాయక చవితి వేడుకల్లో భాగంగా వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ganesh  Vinayaka idols  Ganesh Chathurthi  Ganesh Chavithi  Baahubali  Baahubali Ganesh  

Other Articles