Experts Advice For Private Employees Who Are Suffering Form Narcolepsy Problem | Medicines For Narcolepsy

Private employees suffering narcolepsy problems best medicines

narcolepsy problems, private employees sleeping, private employees problems, insomnia problems, narcolepsy medicines, Antidepressants medicines, private companies

Private Employees Suffering Narcolepsy Problems Best Medicines : Experts Giving Advice To Private Employees Who Are Suffering From Narolepsy Problems To Use Only Antidepressants And Amphetamine Medicines.

ఏం నాయనా.. ఆఫీసులో నిద్రపోతున్నావా?

Posted: 09/14/2015 01:15 PM IST
Private employees suffering narcolepsy problems best medicines

ప్రస్తుత ఆధునిక యుగంలో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులు ఈ సమస్య బారిన పడుతున్నారు. ఎడతెరిపిలేని పని వుండటంతోపాటు సమయానికి పోషకాహారం తీసుకోకపోవడంతో నిద్రలేమికి గురవుతున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్నవారికి నిద్రపై ఎటువంటి నియంత్రణా వుండదు. మీటింగ్స్ లో వున్నప్పుడు, తింటున్నప్పుడు, ప్రయాణ సమయాల్లో.. ఇలా ఎక్కడబడితే అక్కడ నిద్రలోకి జారిపోతారు. ఈ విధమైన సమస్యకు బారినపడినవారు నార్కొలెప్సీ అనే నిద్రసంబంధమైన రుగ్మతతో బాధపడుతుంటారని నిపుణులు చెబుతున్నారు. నార్కొలెప్సీ అనే సమస్యలో నిద్ర, మెలకువ రావడం... రెండూ ప్రభావితమవుతాయి. ఇలాంటి సమస్య ఉన్నవారు పగటివేళ కూడా నిద్రలోకి జారిపోతుంటారు. ఏ పని చేస్తున్నా ఆ సమయంలో తమకు తెలియకుండానే నిద్రలోకి వెళ్లిపోతుంటారు.

నార్కొలెప్సీతో బాధపడేవారిలో నిద్రలోకి జారుకున్న వెంటనే ఆర్‌ఈఎమ్ నిద్ర దశ వేగంగా వచ్చేస్తుంది. ఈ ఆర్‌ఈఎమ్ దశలోనే కలలు వస్తుంటాయి. ఈ దశలో కనుపాపలు, ఊపిరితిత్తులను పనిచేయించే డయాఫ్రమ్ తప్ప మిగతా అన్ని కండరాలు పూర్తిగా అచేతన స్థితిలో ఉంటాయి. ఈ నార్కొలెప్సీ సాధారణంగా 15 నుంచి 25 ఏళ్ల వయసులో మొదలవుతుంది. ఈ సమస్య ఎందుకు వస్తుందనే అంశం ఇంకా తెలియదు. అయితే.. ఇది జన్యువులతో ముడిపడి వుండటం వల్ల చాలామందిలో నార్కొలెప్సీతో బాధపడేవారి పిల్లల్లోనూ ఈ సమస్యని పరిశోధకులు గమనించారు. మరికొందరు శాస్త్రవేత్తలు పేర్కొన్నదాని ప్రకారం.. మెదడులోని హైపోక్రెటిన్ అనే రసాయన లోపం వల్ల ఈ సమస్య రావచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో ఆర్‌ఈఎమ్ దశకు సంబంధించిన సైకిల్‌ను కొనసాగించే మెదడు లోపాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ లోపాల వల్లే మెలకువగా ఉండగానే అకస్మాత్తుగా నిద్రలోకి జారుకునే లక్షణాలు కనిపిస్తాయని వారి పరిశోధనల్లో తేలింది.

అయితే నాడీవ్యవస్థకు చెందిన ఒకటి కంటే ఎక్కువ అంశాలు నార్కొలెప్సీని కలగజేస్తాయని అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు. నార్కొలెప్సీ వచ్చినప్పుడు మనం చేతనావస్థలో ఉపయోగించే కండరాలు అకస్మాత్తుగా అచేతనం అయిపోతాయి. బాధితులు కొన్ని రకాల భ్రాంతులకూ గురికావచ్చు. దీనికి పూర్తిగా చికిత్స లేకపోయినా కొన్ని యాంటీ డిప్రసెంట్స్, యాంఫిటమైన్ మందులతో చికిత్స చేయవచ్చు. ఆ మందులను తరుచూ వాడితే.. కనీస విశ్రాంతి అయిన లభిస్తుంది. కానీ.. ఏమాత్రం నిద్రమాత్రలను తీసుకోకూడదని సూచిస్తున్నారు. ఆ మాత్రలు తీసుకుంటే.. ఆరోగ్యపరమైన సమస్యలు దరిచేరుతాయని, వాటికి బానిసలుగా మారాల్సి వస్తుందని చెబుతన్నారు. కాబట్టి.. వైద్యులు నిర్దేషించిన మందుల్ని (పైన పేర్కోబడినవి) మాత్రమే తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narcolepsy medicines  private employees  

Other Articles