Rahul slams Modi

Rahul gandhi targetted pm narendra modi

Rahul gandhi, Modi, Parliament, Bihar elections, land Bills, GST, Parliament sessions, Congress, BJP

Rahul gandhi targetted Pm Narendra Modi. Rahul slams modi for his govt and RSS strategy in the Parliament sessions.

ఉత్తుత్తి హామీలు.. ఉత్తుత్తి ప్రభుత్వం

Posted: 09/13/2015 01:05 PM IST
Rahul gandhi targetted pm narendra modi

కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. దేశాభివృద్ధిని అడ్డుకుంటున్నారని మోడీ చేసిన విమర్శలకు రాహుల్ కౌంటరిచ్చారు. పార్లమెంట్‌ను ఆరెస్సెస్‌ బ్రాంచ్‌గా మారిస్తే చూస్తూ ఊరుకుంటామా అంటూ సెటైరేశారు. ప్రతిపక్షం గొంతు నొక్కుదామంటే కుదిరే పని కాదని యువరాజు అంటే..రాబర్ట్ వాద్రా భూబాగోతం మాటేంటంటూ కమలనాధులు రివర్స్ ఎటాక్ ఇచ్చారు. పార్లమెంట్‌ను స్తంభింపజేయడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ దేశాభివృద్ధిని అడ్డుకుంటోందన్న ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై రాహుల్‌ గాంధీ ఘాటుగా స్పందించారు. పార్లమెంట్‌ను ఆరెస్సెస్‌ శాఖగా నడపలేరన్న రాహుల్, ప్రతిపక్షం గొంతు నొక్కేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ముఖ్యమైన జీఎస్‌టీ, భూ సేకరణ సవరణ బిల్లులపై ప్రభుత్వం తమను ఎప్పు డు సంప్రదించిందని ఆయన ప్రశ్నించారు. గత సమావేశాల్లో లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లి ఖార్జున ఖర్గేను కూడా నోరు మెదపకుండా చేశారని ఆరోపించారు.

ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన జీఎస్‌టీ బిల్లుపై తమకు అభ్యంతరాలున్నాయన్న రాహుల్, తాము గరిష్టంగా 28 శాతం ట్యాక్స్‌ స్లాబ్‌ కోరుతున్నామని చెప్పారు. అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపూర్‌ ముఖ్యమంత్రులకు తెలియకుండా ప్రధాని మోడీ ప్రభుత్వం నాగా ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. ఉత్తుత్తి హామీలతో ప్రధాని మోడీ ప్రజలను మభ్యపెడుతున్నారని రాహుల్‌  ఆరోపించారు. అటు  కాంగ్రెస్ వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం మండిపడింది. రైతులు, భూ సేకరణ బిల్లు పేరుతో ప్రతిపక్ష కాంగ్రెస్‌ వ్యతిరేక రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తింది. భూ సేకరణ బిల్లుపై కేంద్రాన్ని తప్పుపడుతున్న కాంగ్రెస్‌.. ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా వివాదాస్పద భూ ఒప్పందాలను గుర్తుచేసుకోవాలని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్‌ హయాంలోనే ఎక్కువగా రైతుల భూములు సేకరించారన్నదే వాస్తవమని స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul gandhi  Modi  Parliament  Bihar elections  land Bills  GST  Parliament sessions  Congress  BJP  

Other Articles