chandrababu declare the date for Bhoomi pooja

Ap cm chandrababu naidu announce that on 22nd oct bhoomi pooja for navyandhra

Chandrababu, Bhoomi Pooja, Amaravathi, AP capital, singapur

AP CM Chandrababu naidu announce that on 22nd oct Bhoomi pooja for navyandhra. Chandrababu greets lung for his win in singapur elections.

నవ్యాంధ్ర కొత్త శకానికి అక్టోబర్ 22న ముహూర్తం

Posted: 09/13/2015 01:24 PM IST
Ap cm chandrababu naidu announce that on 22nd oct bhoomi pooja for navyandhra

ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ నుంచే పరిపాలన సాగిస్తున్నారు. ముఖ్యమైన పనులన్నీ అక్కడనుంచే చక్కబెడుతున్నారు. వరుస సమీక్షలతో అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారు. అక్టోబర్ 22న జరిగే నవ్యాంధ్ర నూతన రాజధాని భూమి పూజ  తెలుగు జాతి చరిత్రలోనే ఓ నూతన అధ్యయనం అవుతుందని చంద్రబాబు చెప్పారు. కేపిటల్ సిటీ కోసం 33వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారీ సమీకరించడం దేశంలోనే చారిత్రాత్మకమన్నారు. సింగపూర్ ప్రధానిగా తిరిగి ఎన్నికైన లీసిన్ లూంగ్‌కు సీఎం బాబు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. ఏపీతో కలిసి పనిచేసేందుకు సింగపూర్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న లూంగ్‌ వ్యాఖ్యలను స్వాగతించారు. అటు నవ్యాంధ్ర రాజధానిలో తొలి మెట్రో ప్రాజెక్టుకు లైన్‌ క్లియర్‌ అయింది. మెట్రో రైల్‌ నిర్మాణానికి కేంద్రం అంగీకరించడంతో ఏపీ సర్కార్‌ వేగంగా అడుగులు వేస్తోంది. 6,769 కోట్లతో చేపట్టే విజయవాడ మెట్రో ప్రాజెక్టును ఢిల్లీ మెట్రో రైల్ అధారిటీకి అప్పచెప్తున్నట్లు ప్రకటించారు. మొత్తం 26 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ నిర్మాణం ఉంటుందని, 2018 డిసెంబర్‌ నాటికి తొలిదశ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.

విభజన చట్టంలోని హామీ మేరకు విజయవాడ, విశాఖలో మెట్రో ప్రాజెక్టులు నిర్మిస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన రుణం కోసం జపాన్ సంస్థ జైకాతో మాట్లాడుతున్నామని చెప్పారు.విజయవాడ-గుంటూరు మధ్య హైస్పీడ్ రైళ్లు తీసుకొస్తామనీ, విజయవాడ, గుంటూరు నగరాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ. 1000 కోట్లు కేటాయించామన్నారు. అటు విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రతి రోజు మధ్యాహ్నం 12నుంచి ఒంటిగంట వరకు ప్రజలనుంచి నేరుగా వినతులు స్వీకరిస్తారు. మరోవైపు ఏపీ రాజధాని నిర్మాణానికి ఆ ప్రాంత రైతులు విరాళమిచ్చారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో  తుళ్లూరు ప్రాంతానికి చెందిన రైతులు చంద్రబాబును కలిశారు. ప్రభుత్వం తమకు చెల్లించిన వార్షిక అద్దెల మొత్తం రూ. 3,52,679 చెక్‌ను రాజధాని నిర్మాణానికి విరాళమిస్తున్నట్లు ప్రకటిస్తూ ఆ మొత్తాన్ని సీఎంకి అందజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  Bhoomi Pooja  Amaravathi  AP capital  singapur  

Other Articles