venkiah naidu about smart city

Central minister venkiah naidu gave clarity on smart city status for vijayawada

Venkiah naidu, Nellore, Vijayawada, Smart city

Central MInister Venkiah naidu gave clarity on Smart city status for Vijayawada. He said that he didnt get his home town nellore for smart city status.

నా ఊరికే లేదు.. ఆ ఊరికేం చేస్తా: వెంకయ్య నాయుడు

Posted: 09/13/2015 12:53 PM IST
Central minister venkiah naidu gave clarity on smart city status for vijayawada

తాను దూర సందులేదు.. మెడకేమో డోలా.. అన్న చందాన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తన పరిస్థితిని మొహమాటం లేకుండా చెప్పేశారు. వెంకయ్య నాయుడు మాట తీరు అందరికి తెలుసు. ఆయన మాట్లాడితే ఎవరికైనా చెమటలు పట్టాల్సిందే.. అయితే తాజాగా ఓ ప్రశ్నకు చెప్పిన సమాధానం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. స్మార్ట్ సిటీల ప్రకటనకు సంబంధించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు నిన్న ఆసక్తికర వ్యాఖ్య చేశారు. సొంతూరికే స్మార్ట్ సిటీ ప్రకటించని తాను, విజయవాడకు ఎలా ఇస్తానని వ్యాఖ్యానించారు. నివిజయవాడను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని గతంలో వెంకయ్య చేసిన ప్రకటనను మీడియా ప్రతినిధులు ఆయనకు గుర్తు చేశారు.

దీనికి స్పందించిన వెంకయ్య ‘‘నా సొంతూరు నెల్లూరు నగరాన్నే స్మార్ట్ సిటీగా ఎంపిక చేయలేదు. విజయవాడను ఏ విధంగా ఎంపిక చేస్తాం. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నేను, ఏపీ మునిసిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ నెల్లూరులోనే ఉన్నాం. అయినా ఆ నగరాన్నే ఎంపిక చేయనప్పుడు విజయవాడ ఎలా ఎంపికవుతుంది’’ అని వెంకయ్య అన్నారు. ఆయా నగరాల్లో వసూలవుతున్న పన్ను, పౌర సేవలను ప్రాతిపదికగా చేసుకుని స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేశామని చెప్పిన వెంకయ్య, ఈ విషయాల్లో విజయవాడ వెనుకబడి ఉన్న కారణంగానే స్మార్ట్ సిటీగా ఎంపిక కాలేదని వివరించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkiah naidu  Nellore  Vijayawada  Smart city  

Other Articles