Caught on CCTV camera, 8 youth beat old man to death in Ahmedabad

Merciless youth kill an elderly man to death caught on cctv

crime in gujarat, Ahmedabad crime news, Ahmedabad murder, Ahmedabad violence, CCTV, gujarat shocking incident, shocking incident in gujarat, caught in CCTV, cctv camera, gujarat, murder

In a shocking incident, as many as eight youth mercilessly beat up an elderly man to death in Ahmedabad. The incident has been caught on a CCTV camera.

ITEMVIDEOS: సిసిటీవీకి చిక్కిన గుజరాత్ యువకుల దారుణం..

Posted: 09/10/2015 07:20 PM IST
Merciless youth kill an elderly man to death caught on cctv

పూజ్య బాపూజీ, జాతిపిత మహాత్మ గాంధీ స్వరాష్ట్రం. ఆయన ఎక్కడి నుంచి అహింస ఆయుధాన్ని చేతబట్టి.. అత్యంత విశాలమైన దేశానికి, ఉపఖండంగా బాసిల్లుతున్న భారతావనికి స్వాతంత్ర్యాన్ని సాధించిపెట్టారో.. ఇప్పుడు అదే రాష్ట్రం అందుకు భిన్నంగా వార్తల్లోకి ఎక్కింది. అదే హింసావాదం. ఇది పటేళ్లు రిజర్వేషన్ కావాలని చేసిన ఉద్యమ హింస కాదు. మరేదో ఘటనలు చోటుచేసుకుని గతంలో రక్తం చిందేందుకు కారణమైన ఘటనలు అంతకన్నా కావు. అయితే ఓ అల్లరి మూక తాము తీసుకున్న వస్తువులకు డబ్బులు చెల్లించాలని అడిగటంతో ఏకపక్షంగా సాగిన హింస. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఎనమిది మంది యువకులు అంతా పాతిక, ముఫై ఏళ్ల లోపు వారే. కనీస సంస్కారం లేకుండా, మానవత్వం లేకుండా, కనికరం, పాపభీతి ఏ కోశాన లేకుండా సాగించిన హింస ఇది.



ఓ పాన్ డబ్బా దగ్గరకు వెళ్లి అక్కడ తమకు కావల్సిన వస్తువులు తీసుకొని డబ్బులు అడిగినందుకు పాన్ డబ్బా యజమాని పట్ల క్రూరంగా ప్రవర్తించారు. రోడ్డుపైకి ఈడ్చి చావు దెబ్బలు కొట్టారు. అదికూడా ఏమాత్రం దయలేకుండా పాన్ షాపులో ఉన్న అతడిని బయటకులాగి కర్రలతో ఇష్టమొచ్చినట్లుగా కొట్టడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇంత జరుగుతున్న తమకు ఏమీ పట్టనట్లుగా చుట్టూ నిల్చుని కొందరు వ్యక్తులు చూస్తుండటం..  మానవత్వం ధైర్యాన్ని కోల్పోయిందన్న సందేహాలకు తావిస్తుంది. ఆ తరువాత కొందరు అంబులెన్స్ పోన్ చేయడంతో వారు వచ్చే సరికే పాన్ షాప్ యజమాని మృతి చెందాడు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు అనుమానితులను అదుపులోకి దర్యాప్తు చేస్తున్నారు. సెప్టెంబర్ 1న జరిగిన ఈ కళ్లు చెదిరే ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ahmedabad crime news  Ahmedabad murder  Ahmedabad violence  CCTV  

Other Articles