Sikh American man was brutally injured

Elderly sikh american brutally assaulted in us and called bin laden

Bin Laden, America, Inderjit Singh Mukker, Chicago, Terrorist, US, Sikh-American

Elderly Sikh-American Brutally Assaulted in US and Called Bin Laden. An elderly Sikh-American man was brutally injured and allegedly called a "terrorist" and "Bin Laden" in an apparent hate crime case in Chicago, just days before the US commemorates the anniversary of the September 11 attacks.

బిన్ లాడెన్ అంటూ దాడి.. ఖండించిన సిక్కు సంఘాలు

Posted: 09/10/2015 03:40 PM IST
Elderly sikh american brutally assaulted in us and called bin laden

అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ లాంటి దేశాల్లో ఇప్పటికీ జాత్యహంకారం ఉంది. అక్కడి వారు వేరే జాతి వారి మీద దాడులకు దిగుతుండటం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా అమెరికాలో ఓ భారతీయుడిని బిన్ లాడెన్ అంటూ దాడి చేశారు. టెర్రరిస్ట్ అని, బిన్ లాడెన్ అని తన మీద దాడికి పాల్పడ్డట్లు ఆ భారతీయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీని మీద చికాగో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. గతంలో కూడా ఇలాంటివి జరిగినా ఎక్కడా న్యాయం జరగలేదు. తన కొడుకును పలకరించిడానికి వెళ్లిన భారతీయుడిని గతంలో  పోలీసులు అనుమానంతో దాడికి దిగారు. దాని మీద అంతర్జాతీయంగా ఆగ్రహం వ్యక్తం కావడం తర్వాత కోర్టుకు వెళ్లడం జరిగిపోయాయి. తాజా ఘటనతో మరోసారి అమెరికాలో జాత్యహంకారం మీద చర్చకు తెర లేచింది.

అమెరికా పౌరసత్వాన్ని పొందిన ఇందర్జీత్ ముక్కర్ కు ఇద్దరు పిల్లలున్నారు.  కూరగాయల దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. 'టెర్రరిస్ట్ గో బ్యాక్ టు యువర్ కంట్రీ, బిన్ లాడెన్' అంటూ నినాదాలు చేస్తూ ఇందర్జీత్ ముక్కర్ పై దాడికి పాల్పడ్డారని సమాచారం. ఓ వ్యక్తి తన మొహంపై పదేపదే పంచ్లు విసిరాడని దీంతో కొద్దిసేపు తనకు ఊపిరాడలేదని, స్పృహకోల్పోయినట్లు బాధితుడు ముక్కర్ చెబుతున్నాడు. తీవ్రంగా రక్తస్రావం అవుతున్న అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స చేసి ఆరు కుట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు. దవడ భాగంలో ఓ ఎముక ఫ్రాక్చర్ అయినట్లు కూడా సమాచారం. ఇలా అక్కడి పౌరుడిగా ఉంటున్నా కానీ జాత్యహంకారంతో ఇలా దాడులకు దిగడం సిగ్గుచేటు. అమెరికా కఠినమైన చట్టాలు తీసుకువచ్చి అక్కడి వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bin Laden  America  Inderjit Singh Mukker  Chicago  Terrorist  US  Sikh-American  

Other Articles