India and Pakistan dicussions

India pakistan border force talks to start today

India, Pakistan, Border, ARmy meeting, Pakistan on Kashmir, India on Kashmir

Amid a growing war of words and firing from across the border, a high-level delegation from Pakistan crossed over to India on Wednesday and arrived in New Delhi for director-level talks between the border forces of both countries.

నేటి నుంచి ఇండియా-పాకిస్థాన్ చర్చలు

Posted: 09/10/2015 03:29 PM IST
India pakistan border force talks to start today

భారత్, పాక్ మిలిటరీ డైరెక్టర్ జనరల్స్ మధ్య నేటి నుంచి మూడు రోజుల పాటు చర్చలు జరుగనున్నాయి. గతనెల 23, 24 తేదీల్లో ఇరుదేశాల జాతీయ భద్రతాసలహాదారుల మధ్య చర్చలు చివరిక్షణంలో రద్దయిన నేపథ్యంలో మిలిటరీ చీఫ్‌ల మధ్య చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది. తాజాగా జమ్ముకశ్మీర్‌లో సరిహద్దుల్లో ఎల్వోసీ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన, సీమాంతర ఉగ్రవాద చొరబాట్లపైనే చర్చ జరిగే అవకాశముంది. ఈ చర్చల్లో పాల్గొనేందుకు 16 మంది సభ్యులతో కూడిన పాకిస్థాన్ ప్రతినిధి బృందం అమృత్‌సర్ మీదుగా ఢిల్లీకి చేరుకున్నది. పాక్ బృందానికి నేతృత్వం వహిస్తున్న రేంజర్స్ డీజీ మేజర్ ఉమర్ ఫరూఖ్ బర్కీకి ఢిల్లీ విమానాశ్రయంలో బీఎస్‌ఎఫ్ డీజీ డీకే పాఠక్ స్వాగతం పలికారు.

అంతకుముందు అమృత్‌సర్‌కు సమీపంలో పాక్ బృందానికి అట్టారి - వాఘా సరిహద్దు వద్ద సీనియర్ బీఎస్‌ఎఫ్ కమాండర్లు స్వాగతం పలికారు. భారత్ తరఫున బీఎస్‌ఎఫ్ డీజీ పాఠక్ నేతృత్వంలో 23 మంది అధికారులు పాల్గొంటారు. జమ్ముకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్ రేంజర్లు అకారణంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో పౌరులు, సైనికులు మృతి చెందిన అంశాలను బీఎస్‌ఎఫ్ ప్రధానంగా లేవనెత్తనున్నదని సమాచారం. కాల్పులు నిలిపేయాలని వైట్ ఫ్లాగ్ ప్రదర్శించినా పాక్ నుంచి స్పందన లేకపోవడం మీద బీఎస్‌ఎఫ్ ప్రస్తావిస్తుందని తెలిసింది. కమ్యూనికేషన్స్, నిరంతర సమన్వయంతో కూడిన పెట్రోలింగ్, ఇతర విశ్వాస కల్పన చర్యలపై చర్చల్లో సానుకూల దృక్పథం ఉంటుందని భారత దళాలు ఆకాంక్షిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Pakistan  Border  ARmy meeting  Pakistan on Kashmir  India on Kashmir  

Other Articles