Chandrababu Naidu Orders CRDA Make Plan To Build 8 Towns In Capital City Amaravathi | Andhra Pradesh Govt

Ap govt crda plans to make 8 towns in capital city amaravathi

amaravathi, ap capital city amaravathi, amaravathi master plan, amaravathi photos, capital city amaravathi plan, amaravathi updates, chandrababu naidu, chandrababu meeting on amaravathi

AP Govt CRDA Plans To Make 8 Towns In Capital City Amaravathi : Chandrababu Naidu Orders CRDA Make Plan To Build 8 Towns In Capital City Amaravathi.

8 నగరాలతో ‘అమరావతి’ మిళమిళ

Posted: 09/10/2015 02:48 PM IST
Ap govt crda plans to make 8 towns in capital city amaravathi

ఆంధ్రరాష్ట్ర రాజధాని నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. మరిన్ని ప్రణాళికలను రూపొందిస్తోంది. రాజధానిలో 8 నగరాల ఏర్పాటుకు సరికొత్త ప్రతిపాదనలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. రాజధానిలో నాలెడ్జ్, ఎడ్యుకేషన్, ఫైనాన్స్, జస్టిస్‌తోపాటు మరో నాలుగు నగరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఆయన వెల్లడించారు. బుధవారం రాజధాని వ్యవహారాలపై సీఎం క్యాంపు కార్యాలయంలో సీఆర్‌డీఏ అధికారులతో బాబు సమీక్షించారు. ఈ సమీక్షలో భాగంగా ఆయన వివరించిన వివరాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. అవి ఏమిటంటే..

* రాజధానిలో 8 నగరాల ఏర్పాటు ప్రతిపాదనలకు కన్సల్టెన్సీలను నియమించుకోవాలి.
* ప్రస్తుతం 3 టీఎంసీలున్న ప్రకాశం బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యాన్ని 5 టీఎంసీలకు పెంచేందుకు పరిశీలించాలి.
* రాజధాని ప్రాంతంలో 19,679 మంది కూలీలకుగాను 13,600 మందికి రూ.2,500 పెన్షన్ ఇస్తున్నారు. మిగిలిన వారికి త్వరలో ఇచ్చేయాలి.
* రాజధాని మాస్టర్‌ప్లాన్‌కు డ్రాఫ్ట్‌ను రూపొందించి.. ఆ పనిని 30రోజుల్లో పూర్తి చేయాలి.
* గన్నవరం విమానాశ్రయంలో విమాన పార్కింగ్ స్టాండ్లను 16కు విస్తరించాలి. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా జాతీయ రహదారికి వెళ్లేందుకు ఒక ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలి. విమానాశ్రయ విస్తరణకు అవసరమైన భూసమీకరణను పూర్తి చేయాలి.
* ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల తరలింపును వేగవంతం చేయాలి. జవహర్‌రెడ్డి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీదే ఈ బాధ్యత.
* రాజధాని శంకుస్థాపన పైలాన్ ఏపీ ఆకాంక్షలకనుగుణంగా ఉండాలి. దీన్ని భవిష్యత్తులో పార్కుగా మార్చేలా చూడాలి.

మరోవైపు... బ్రిడ్జి ఇంటర్నేషనల్ అకాడమీస్(బీఐఏ) ఏపీని నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగస్వామి కావడానికి సుముఖత వ్యక్తం చేసింది. సంస్థ సహ వ్యవస్థాపకురాలు, చీఫ్ స్ట్రేటజీ అధికారి షన్నన్‌మే బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు. ఇక అక్టోబర్ 22న రాజధాని శంకుస్థాపనకు జపాన్ వాణిజ్య శాఖా మంత్రి రానున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amaravathi  ap capital city  chandrababu naidu  

Other Articles