CA Student Suicide

Student commits suicide by jumping from building in hyderabad

Suicide, Hyderabad, Student, Arya Vysya Hostel, CA Student, Musherabad

Disgusted over the allegations of mobile phone theft against him, a 20-year-old Chartered Accountancy (CA) student committed suicide by jumping off a three storeyed hostel building here, Wednesday. The incident took place at Bakaram locality in Musheerabad police

ITEMVIDEOS: సెల్ ఫోన్ దొంగ అన్నారని ఆత్మహత్య

Posted: 09/10/2015 02:47 PM IST
Student commits suicide by jumping from building in hyderabad

హైదరాబాద్ ముషీరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది.  ఓ నింద నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. సెల్ ఫోన్ దొంగలించాడని ఆరోపణలు చేయడంతో మనస్తాపం చెందిన విద్యార్థి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. వాసవి ఆర్యవైశ్య వసతి గృహంలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ లోని మూడో అంతస్తుపై నుంచి దూకి చనిపోయాడు. మృతుడిని హరీష్ గా గుర్తించారు. హరీష్ సీఏ చదువుతున్నాడు. సెల్ ఫోన్ దొంగతనం చేశాడనే ఆరోపణలతో మనస్తాపానికి గురైన హరీశ్.. ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.


నిజామాబాద్ జిల్లాకు చెందిన హరీశ్ ఆర్యవైశ్య హాస్టల్ లో ఉంటూ సీఏ చదువుతున్నాడు. కొడుకు మృతి వార్తతో కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. హరీష్ భవనం పై నుంచి దూకిన విజువల్స్ హాస్టల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పై నుంచి పడిన తర్వాత పెద్ద శబ్దవ రావడంతో ఇతర విద్యార్థులు కంగారు పడ్డారు. అయితే పడింది హరీష్ అని తెలుసుకుని వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. కానీ హరీష్ అప్పటికే చనిపోయాడు. అయితే దీని మీద పోలీసులు విచారణ చేసి.. హాస్టల్ వార్డెన్ ను, ఇద్దరు విద్యార్థులను అరెస్టు చేశారు. వార్డెన్ అందరి ముందు సెల్ ఫోన్ కొట్టేసింది నువ్వే అని అన్నారని.. ఒకవేళ సెల్ ఫోన్ తిరిగి ఇవవ్కపోతే హాస్టల్ నుంచి పంపించేస్తానని హెచ్చరించారని.. దాంతో హరీష్ ఆత్మహత్య చేసుకున్నట్లు డిసిపి వి బి కమలాసన్ రెడ్డి తెలిపారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Suicide  Hyderabad  Student  Arya Vysya Hostel  CA Student  Musherabad  

Other Articles