bihar elections will be affected on entire country lalu prasad

Lalu nitish welcome election schedule for bihar

lalu prasad yadav on bihar assembly elections, bihar elections referendum to modi, bihar assembly elections, lalu prasad Yadav, nitish kumar, PM Modi, Congress, Rahul gandhi, sonia gandhi, mulayam singh, janata parivar, BJP, amit shah, susheel modi, sharad yadav

Chief Minister Nitish Kumar and RJD President Lalu Prasad today welcomed announcement of assembly election schedule for Bihar and said they were 'well prepared'.

బీహార్ ఎన్నికల ప్రభావం దేశవ్యాప్తంగా వుంటుందన్న లాలూ

Posted: 09/09/2015 10:09 PM IST
Lalu nitish welcome election schedule for bihar

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో.. ఆర్జేడీ నేత లాలు ప్రసాద్ తనదైనశైలిలో స్పందించారు. ఈ ఎన్నికలు కేవలం రాష్ట్రానికే పరిమితం కావని.. దేశానికి జరగబోయే ఎన్నికలంటూ నరేంద్ర మోదీ సర్కారుకు చురకలంటించారు.  వచ్చే నెలలో బీహార్ లో జరుగనున్న ఎన్నికలు.. దేశం మొత్తానికి ప్రతిబింబిస్తాయన్నారు. ప్రభుత్వ పనితీరు నచ్చినవారు తమకే ఓటు వేస్తారని బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీష్ కుమార్ అన్నారు. బుధవారం బీహార్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వచ్చిన నేపథ్యంలో నితీష్ స్పందించారు.

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ పెంచడం పాత నిర్ణయమేనని, కొత్తగా తీసుకున్నది కాదని నితీష్ చెప్పారు. జనతా పరివార్ కూటమి నుంచి సమాజ్వాదీ పార్టీ వైదొలగడంపై స్పందిస్తూ.. స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కు ఆ పార్టీ అధినేత ములాయం సింగ్కు ఉందన్నారు. ఈ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ కూటమి గెలుస్తుందనే నమ్మకముందని జేడీయూ నేత శరద్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.ఈ ఎన్నికల్లో లాలు ప్రసాద్కు చెందిన ఆర్జేడీ, సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) కూటమిగా కలిసి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ మాత్రం విడివిడిగా పోటీ చేయనున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bihar assembly elections  lalu prasad Yadav  nitish kumar  PM Modi  Congress  

Other Articles