Cabinet increases DA by 6% for central govt employees, pensioners

Cabinet approves 6 hike in da for central govt employees

dearness allownce, da, da hike, dearness allowance hike, central govt da hike, central govt dearness allowance, da increase, da hike percent, Union cabinet, PM Modi, central govt employees, Dearness Allowance, india news

Union cabinet approved six percent increase in DA for central government employees, making the total to 119 percent, a move that would benefit 48 lakh employees 55 lakh pensioners.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు..

Posted: 09/09/2015 10:07 PM IST
Cabinet approves 6 hike in da for central govt employees

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర మంత్రి వర్గం తీపి కబురును అందించింది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఢిల్లీలో భేటీ అయిన మంత్రివర్గం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువుభత్యాన్ని 6 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు కరువుభత్యం ప్రస్తుతం 113 శాతం కాగా, పెంపునకు ఆమోదముద్ర పడటంతో119 శాతానికి చేరుతుంది. దీనివల్ల దేశంలోని కోటి మందికిపైగా ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది. ఈ ఏడాది ఏప్రి ల్‌లో 107 శాతంగా ఉన్న కరువుభత్యాన్ని 6 శాతం పెంచిన ప్రభుత్వం, దాన్ని జనవరి నుంచి అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

మూలవేతనం (బేసిక్ పే) ప్రాతిపదికగా లెక్కించే కరువు భత్యం తాజా పెంపుపై కేబినెట్‌ ఆమోదముద్ర వేయడంతో పెంచిన కరువు భత్యం ఈ ఏడాది జూలై 1 నుంచి అమలులోకి వస్తుంది. నిరుడు జూలై 1 నుంచి ఈ ఏడాది జూన్‌ 30 వరకుగల 12 నెలల పారిశ్రామిక కార్మిక-వినియోగదారు ధరల సూచీ సగటు ఆధారంగా ఈ పెంపును నిర్ణయించిన కేంద్రం ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో పాటు వినియోగంలో లేని స్పెక్ట్రమ్‌ కొనుగోలు లేదా అమ్మాలని నిర్ణయించింది. సముద్రతీరంలో పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. బంగారం బాండ్ల పథకానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలపడంతో పాటు 5, 10, 50, 100 గ్రాముల లెక్కన బాండ్ల జారీకి నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై బంగారం స్థానంలో ఆర్‌బీఐ బాండ్లు ఇవ్వనుంది. వీటిపై ఏటా వడ్డీ తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Union cabinet  PM Modi  central govt employees  Dearness Allowance  

Other Articles