police arrested youth who abducted and raped minors

Youth held for raping minor in anantapur

Youth held for raping minor in Anantapur, minors rape, Anantapur, vajrakarroor, kurnool, kallooru, violence against women, crime against women, attrocity at women, harrassment on women, rape, gang rape, Anantapur, raped and abducted minors, kurnool police

kurnool police arrested two accused from anatapur district who raped and abducted minors

రాఖీ కట్టించుకుంటామని మైనర్లపై అత్యాచారం..

Posted: 09/08/2015 05:50 PM IST
Youth held for raping minor in anantapur

అన్నచెల్లెళ్ల, అక్కా తమ్ముళ్ల పవిత్రమైన ప్రేమకు ఆలవాలంగా నిలిచే రాఖీ పండుగ ముందు రోజున.. మంగళకరమైన సంప్రదాయాన్ని మంటగలిపి, అపవిత్ర కార్యాలకు పాల్పడ్డారు ఇద్దరు మానవ మృగాలు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ దారుణ ఘటన వివరాలు ఇలా వున్నాయి. రాఖీ కట్టించుకుంటామని చెప్పి ఇద్దరు విద్యార్థినులపై అత్యాచారం జరిపి పైశాచికంగా వ్యవహరించారు నిందితులు.. కర్నూలు జిల్లా కల్లూరు జడ్పీ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులపై అనంతపురం యువకులు అత్యాచారం జరిపారు.

రాఖీ కట్టించుకుంటామని చెప్పి..  విద్యార్థినులను అనంతపురం జిల్లా, వజ్రకరూర్‌కు తీసుకువెళ్లి ఐదు రోజుల పాటు నిర్బంధించి అత్యాచారం చేశారు. రాఖీలు కట్టించుకుంటామనే నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. యువకుల బారి నుంచి తప్పించుకున్న విద్యార్థినులు ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విద్యార్థి, మహిళా సంఘాలు మండిపడ్డాయి. బాధితులకు న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : minors rape  Anantapur  vajrakarroor  kurnool  kallooru  

Other Articles