Prakash Raj | kondareddypalli | Visiting

Actor prakash raj visted kondareddypalli which is adopted by him

Prakash Raj, Kondareddypalli, Mahabubnagar, Adopt, Srimanthudu, Mahesh Babu, Telangana, Prakash Raj foundation

Actor Prakash Raj visted Kondareddypalli which is adopted by him. Today Prakash Raj visited the village and discuss about the prblems.

ప్రకాశ్ రాజ్ పని మొదలుపెట్టాడు

Posted: 09/08/2015 03:15 PM IST
Actor prakash raj visted kondareddypalli which is adopted by him

యుద్దం మొదలు పెట్టిన వాడు వీరుడు కాడు.. యుద్దాన్ని ముగించిన వాడే వీరుడు. ఇది యుద్దంలో ఓ వీరుడి గురించి నిజం. నిజ జీవితంలో కూడా అంతే మాటలు చెప్పడం, గొప్పలు చెప్పడం కాదు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం.. ఆడిన మాటను మరువకపోవడం గొప్ప. తాజాగా విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ శ్రీమంతుడిలా మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవడమే కాకుండా రంగంలోకి దిగి గ్రామాన్ని బాగుచేసేపనిలో నిమగ్నమయ్యారు ప్రకాశ్ రాజ్. ‘‘నేను రాజకీయాల్లోకి రావడానికో .. మరో స్వార్ధానికో గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకు రాలేదు. గ్రామాల అభివృద్ది ప్రజల హక్కు. భవిష్యత్ లో కొండారెడ్డి పల్లి గ్రామ ప్రజలు ఇతర గ్రామాలను దత్తత తీసుకునే స్థాయికి ఎదగాలని” ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్న మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డి పల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటానని కేటీఆర్ ను కలిసి ప్రతిపాదించిన ప్రకాష్ రాజ్ ఈ రోజు గ్రామస్తులతో సమావేశం అయ్యారు.

ప్రకాష్ రాజ్ కు ఈ ఊరి పక్కనే ఫాం హౌస్ ఉంది. అక్కడ ఆయన భూమి సాగు చేస్తూ వివిధ రకాల కూరగాయలు కూడా పండిస్తున్నారు. అంతే కాకుండా ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ ద్వారా ఆయన ఇతర రాష్ట్రాలలో కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ రోజు కొండారెడ్డి పల్లి వాసులతో కలిసి గ్రామంలోని సమస్యలు, పనుల మీద ఆయన చర్చించారు. ఈ రోజు ప్రకాష్ రాజ్ తో పాటు కలెక్టర్ శ్రీదేవి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ లు పాల్గొన్నారు. ప్రకాష్ రాజ్ గ్రామంలో మొక్కలు నాటారు.  కొండారెడ్డిపల్లి అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయపడుతానని,  ఎలాంటి అభద్రతాభావం లేకుండా గ్రామాభివృద్ధికి అందరూ పాటు పడాలని పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles