Kumar Mangalam Birla | Jatia House | 425 cr

Kumar mangalam birla buys jatia house for 425 cr

Jaita house, Kumar Mangalam Birla, Mumbai, Jatia House for 425 cr, Malabar Hills

The iconic Jatia House in Malabar Hill, which was on the block for quite some time, has not only finally been sold, it has set a new record in the process. The new owner of the bungalow is Kumar Mangalam Birla of the Aditya Birla Group, who bid Rs. 425 crore for the property - which has a 25,000 sq ft built-up area - during an auction yesterday, making it the most expensive bungalow deal in the country.

ఆ బిల్డింగ్ కొనడానికి 425 కోట్లు

Posted: 09/08/2015 01:45 PM IST
Kumar mangalam birla buys jatia house for 425 cr

ఆ మధ్యన కారు కొనడానికి కోట్లు ఖర్చు చేసిన కోటీశ్వరుడు.... బైక్ కొనడానికి లక్షలు వెచ్చించిన సంపన్నుడు.. విలాసాలకు, జల్సాలకు కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్న బడా బాబులు. ఇలాంటి వార్తలు ఈ మధ్యన సర్వాసాధారణమైపోయాయి. దేశంలో పేదరికం ఇంకా ఉంది అనే వార్త కన్నా దేశంలో ధనవంతుల సంఖ్య పెరుగుతోంది అన్న వార్తకే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది. సరే ఇదంతా ఎందుకు కానీ తాజాగా ఓ బిగ్ ఫ్యామిలీకి చెందిన వార్త హల్ చల్ చేస్తోంది. అంతలా ఆ వార్త ఏంటి అనుకుంటున్నారా..? ఏమీ లేదు కొన్ని కోట్లు ఖర్చు చేసి వారు ఓ భవనాన్ని కొన్నారు. అయితే ఖరీదంటే మామూలు ఖరీదు కాదు ఏకంగా 425 కోట్ల ఖరీదైన బిల్డింగ్.

భవనం ఖరీదు 425 కోట్లా అని నోరెళ్ల వెళ్లబెడుతున్నారా ? అవును ఇది నిజం. ఇంత డబ్బు పెట్టి ఎవరు కొంటారా ? అని ఆశ్చర్యపడుతున్నారు. మన దేశంలో కుబేరులకు తక్కువా చెప్పండి. ఈ భవంతిని ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా' కొనుక్కున్నాడు. ఇంతకు ఈ బిల్డింగ్ ఎక్కడుంది అంటారా ? దేశంలోని ప్రముఖ వాణిజ్యనగరంగా పేరొందిన ముంబై లో ఉంది. ముంబైలోని మలబార్ హిల్ పై జటియా హౌజ్ అనే భవంతి ఉంది. దాదాపు 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవంతి ఉంది. ఈ భవనం విక్రయించడానికి వేలం పెట్టారు. ఈ వేలంలో భవంతిని దక్కించుకోవడానికి చాలా మందే పోటీ పడ్డారు. చివరకు కుమార మంగళం బిర్లా 425 కోట్లు పెట్టి ఈ భవంతిని దక్కించుకున్నారు. ముందు చేసుకున్న ఒప్పందంలో భాగంగా పది శాతం మొత్తాన్ని బిర్లా చెల్లించారని, మిగతాది త్వరలోనే ఇవ్వనున్నారని వేలం పాట నిర్వహించిన ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ పేర్కొంది. ఇదే ప్రాంతంలోని మహేశ్వరీ హౌస్ 2011లో  400 కోట్లకు అమ్ముడు పోగా జటియ హౌస్ కు సమీపంలోని హోమీ హౌస్ 372 కోట్లకు అమ్ముడుపోయింది. అంటే ఈ రికార్డులను బిర్లా బద్దలు కొట్టారన్నమాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jaita house  Kumar Mangalam Birla  Mumbai  Jatia House for 425 cr  Malabar Hills  

Other Articles