Parents fury school demands doctors note children need toilet

Pupils told they must have a doctor s note to go to the toilet during lessons

Parents,fury,school,demands,doctor,s,note,children,need,toilet,lessons, St Teilos, doctors note, toilet, lessons, permission, leave class, St Teilo's Church in Wales High School, Cardiff, south Wales, 25 pounds, britain school, Text message, parents, doctors note, wales high school, parents fury by school message

A text message was sent out by teachers to the parents of all Year 11 pupils at St Teilo's Church in Wales High School in Cardiff, south Wales. One parent branded the demand 'appalling'

ఆ స్కూల్ లో టాయిలెట్ వెళ్లాలంటే డాక్టర్ సర్టిఫికెట్ కావాల్సిందే..!

Posted: 09/06/2015 05:17 PM IST
Pupils told they must have a doctor s note to go to the toilet during lessons

ఆ స్కూల్ లో టాయిలెట్ కు వెళ్లాలంటే డాక్టర్ సర్టిఫికేట్ కావాల్సిందేనట. అది కూడా వారం రోజుల్లోపు తమకు అందజేయాలని బ్రిటన్‌లోని ఓ పాఠశాల నూతన నిబంధనను పెట్టింది. అదేంటి పాఠశాలలో టాయిలెట్ కు వెళ్లాలంటే.. డాక్టర్ సర్టిఫికెట్ ఎందుకు..? అని పలు రకాల అనుమానాలు మీ మదిని తొలుస్తున్నాయా..? కానీ ఇది నిజం. కార్డిఫ్ లోని సెయింట్ టెయిలోస్ చర్చి వేల్స్ హై స్కూల్ నుంచి 11 వ తరగతి చదువుతున్న విద్యార్ధుల తల్లిదండ్రులందరికీ ఈ టెక్ట్స్ మెసేజ్‌ను వెళ్లింది.

ఈ మెసేజ్ ను చూసి అవాక్కవ్వడం తల్లిదండ్రుల వంతైంది. ‘‘మీ పిల్లలు క్లాసు మధ్యలో టాయిలెట్‌కు వెళ్లాలంటే... వచ్చే వారానికల్లా ఈ మేరకు డాక్టర్ నోట్‌ను సమర్పించండి. పాస్‌లు జారీచేస్తాం’’ అని హైస్కూల్ యాజమాన్యం ఎస్సెమ్మెస్ పంపింది. దీన్ని చూసి పేరెంట్స్ ఆశ్ఛర్యానికి గురపోయారు. స్కూల్ వాదనేమిటంటే... పదకొండో తరగతికి వచ్చిన పిల్లలు ఒక నియమపద్ధతికి అలవాటుపడతారని, అలా అని తరగతుల మధ్యలో మూత్రానికి వెళ్లడం మంచికాదని యాజమాన్యం వాదిస్తుంది.

అలా వెళ్లాలనుకునే విద్యార్థులు అతిమూత్రం తదితర ఆరోగ్య సమస్యలుంటే... దాన్నే తెలియజేస్తూ డాక్టర్ నోట్‌ను సమర్పించాలని తాము చెప్పామంటోంది. ఒకటికి వెళ్లాలన్నా డాక్టర్ సర్టిఫికెట్ తేవాలనడమేమిటని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం తమ ఇష్టానుసారంగా నిబంధనలు మార్చుతూ.. కోత్త నిబంధనలను పెడుతూ.. తమను, తమ పిల్లలను వేదిస్తోందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఒక విద్యార్థి తల్లైతే.. ఏకంగా డాక్టర్‌తో కూడా మాట్లాడిందట. 25 పౌండ్లు (భారత కరెన్సీలో 2,500 రూపాయలు) అవుతుందని డాక్టరు చెప్పారట. ఇదో అదనపు వాయింపని పేరెంట్స్ నిట్టూర్చిందట.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 25 pounds  britain school  Text message  parents  doctors note  wales high school  

Other Articles