rishiteswari father murali krishna wrote a letter to chandra babu naidu

No compromise in rishiteswari case untill culprit get conviction says muralikrishna

rishiteswari case, Nagarjuna University, Murali Krshna, Ragging, ANU, Acharya Nagarjuna University, Mondi Rishiteswari Ist yr B.Arch student, ganta srinivas rao, guntur district sessions court, accused bail petition, Rishiteswari accused bail rejected, court rejects accused bail petition

rishiteswari father murali krishna wrote a letter to AP chief minister chandra babu naidu stating that there is no compromise in rishiteswari case untill culprit get conviction.

రిషితేశ్వరి కేసులో నిందితులకు శిక్ష పడేవరకు రాజీపడేది లేదు..!

Posted: 09/03/2015 11:42 PM IST
No compromise in rishiteswari case untill culprit get conviction says muralikrishna

ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ఆత్మహత్యకు పాల్పడిన బి. ఆర్క్ మొదటి సంవత్సరం విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితులకు శిక్ష పడే వరకూ తన పోరాటం కొనసాగిస్తానని తండ్రి మురళీ కృష్ణ స్పష్టం చేశారు.  ఈమేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి  ఆయన గురువారం లేఖ రాశారు. తన కూతురు రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయాన్ని తీసుకున్నంత మాత్రన ఆ కేసులో రాజీపడినట్లు కాదని ఆయన తేల్చిచెప్పారు. తన కూతురు ఆత్మహత్య నేపథ్యంలో తమకు కేవలం మానవాతా దృక్పధంతోనే తమకు సాయం చేస్తున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారన్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.

కాగా తమ కూతురు ఆత్మహత్య కేసులో ఇప్పటికే అనేక అనుమానాలున్నాయని ఆయన పేర్కొన్నారు. రిషితేశ్వరిని మరికొందరు సీనియర్లు వేధించారని ఆరోపణలున్నా..  ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. ఈ కేసులో ప్రిన్సిపాల్ బాబురావు పాత్ర కన్పిస్తున్నా.. అతనిపై కేసు ఎందుకు నమోదు చేయడంలేదని లేఖలో ప్రశ్నించారు. కేసును లోతుగా దర్యాప్తు చేసి అసలు విషయాలను బయటకు తేవాలన్నారు. ఆర్థికసాయం కోసం కేసులో ఎవరితో రాజీ పడే ప్రసక్తే లేదని లేఖ ద్వారా చంద్రబాబుకు తెలిపారు.

మురళీ కృష్ణ రాసిన లేఖలో పొందుపర్చిన మరిన్ని అంశాలు..

* ప్రిన్సిపాల్ బాబూరావు పాత్ర కన్పిస్తున్నా.. అతనిపై కేసు ఎందుకు నమోదు చేయలేదు?
* ఫ్రెషర్స్ డే రోజు బాబూరావు ఉద్దేశపూర్వంకగానే రిషితేశ్వరికి శ్రీనివాస్ తో అవార్డు ఇప్పించారు
* రిషితేశ్వరితో అసభ్యంగా ప్రవర్తించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?
* రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న గది వద్దకు ముందుగా ప్రిన్సిపాల్ బాబు ఎలా వెళ్లారు..?
* పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఎందుకు తరలించారు?
* బాలసుబ్రహ్మణ్యం కమిటీ నివేదికలో ర్యాగింగ్ జరిగిందని తేల్చినప్పటికీ బాబురావుపై ఎందుకు కేసు నమోదు చేయలేదు?
* గతంలో బాబూరావుపై బీఆర్కే ఫ్యాకల్టీ డేవిడ్ రాజు గవర్నర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎందుకు లోతైన విచారణ జరగలేదు?
* పోలీసులు చార్జిషీటు వేయకముందే వీటిపై విచారణ జరిపి ప్రిన్సిపాల్ బాబూరావుపై కేసు నమోదు చేయాలి
* సిట్టింగ్ జడ్జితో రిషితేశ్వరి కేసును విచారించాలి

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rishiteswari case  Nagarjuna University  Ragging  ANU  Murali Krshna  

Other Articles