robber trapped in leg lock by martial arts women champion

Mma fighter monique bastos foils robbery attempt again in brazil

MMA fighter Monique Bastos foils robbery attempt again in Brazil, Humiliated,robber,trapped,leg,lock,begs,Daddy,attacking,woman,Brazil,unaware,martial,arts,champion, Jiu-Jitsu training, Strawweight fighter, Monique Bastos, Wesley Sousa de Araujo, Mugger pleads for life, lion killer choke’

Humiliated robber is trapped in a leg lock and begs for ‘Daddy’ after attacking a woman in Brazil… unaware that she was a martial arts champion

ఎరక్కపోయి ఎళ్లాడు.. ఇరుక్కుపోయాడు.. ప్రాణం కోసం అర్థించిన దోపిడిదొంగ

Posted: 09/03/2015 11:31 PM IST
Mma fighter monique bastos foils robbery attempt again in brazil

ప్రపంచ వ్యాప్తంగా దోంగతనాలు లేని దేశం ఏదీ లేదనే చెప్పాలి. తాజాగా బ్రెజిల్ దేశంలో ఓ దొంగకు ఓ విచిత్రమైన అనుభవం ఏదురైంది. సాధారణంగా అతను మరో స్నేహితుడితో కలసి చీకట్లు కమ్మకున్న తరువాత దారిదోపిడీలకు పాల్పడుతుంటాడు. అయితే ఇందుకు తాను ముఖ్యంగా మహిళలనే ఎందుకుంటాడు. ఎందుకంటే ఏ దేశమైనా అడవారు మృదుస్వభావులు.. త్వరగా భయపడి ఉన్నదంతా తమ చేతికి ఇస్తారని వారి నమ్మకం. ఇవాళ కూడా దారిదోపిడికి కోసం మాటు వేశారు. అనుకున్నట్లే వారికి ముగ్గురు మహిళలు కారులో వస్తూ కనబడ్డారు. అంతే ఒక్కసారిగా వారి దారికి అడ్డుపడి.. వారి వద్దకు వెళ్లి తమ వద్దనున్న విలువైన అభరణాలు, నగదు, నట్రా ఇవ్వాలని హుంకరించారు. లేని ఫక్షంలో వారందరినీ చంపేస్తామని కూడా బెదిరించారు.

ఆ తరవాత వాళ్లకి అనిపించింది ఎరక్కపోయి ఇరుక్కుపోయామని. ఎందుకంటారా..? ఆ దొంగ ఆపిన మహిళ.. మార్షల్ ఆర్ట్స్లో పెద్ద ఛాంపియన్..దొంగ అలా వెళ్లి ఆమెను బెదిరించాలని అనుకున్నాడో లేదో.. తనదైన స్టైల్లో రెండు పంచ్లు ఇచ్చి, కాళ్లు మడతేసి జియు-జిట్సు అనే మూవ్తో అతగాడిని తాడు లేకుండానే బంధించేసింది. దాంతో అతడు 'నాన్నోయ్.. నన్ను ఈవిడ చంపేస్తోంది.. కాస్త కాపాడు' అంటూ గగ్గోలు పెట్టాడు. తన రెండు కాళ్ల మధ్య ఆ దొంగను ఆమె బంధించి, అతడి మెడను 'లయన్ కిల్లర్ చోక్'తో లాక్ చేసేసింది. ఈలోపు పోలీసులకు విషయం చెప్పింది. వాళ్లు వచ్చి అతగాడిని బంధవిముక్తుడిని చేశారు. విషయం ఏమిటంటే, అతగాడు వెళ్లిన ఇంటి యజమానురాలు మిస్ బాస్టోస్కు ఎంఎంఏ ఫైట్స్లో ఆరు ప్రొఫెషనల్ రికార్డులు ఉన్నాయి. అలాంటి ఫైటర్తో పెట్టుకుంటే మాటలా మరి!!

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh