Ragging | Nagarjuna University | Guntur

One more ragging case in nagarjuna university

Ragging, Nagarjuna University, Police, Ganta Srinivas, Rishiteshwari, Suicide

One more Ragging case in Nagarjuna University. First Year degree university student complaints to police on raggin in the university.

నాగార్జున యూనివర్సిటిలో మరో ర్యాగింగ్ కేసు

Posted: 09/03/2015 10:51 AM IST
One more ragging case in nagarjuna university

నాగార్జున యూనివర్సిటి ఎంతో మందికి చదువుల కల్పవల్లిగా తెలిసి ఉండవచ్చు కానీ తాజగా మాత్రం నాగార్జున యూనివర్సిటి అంటే విద్యార్థుల పాలిట ర్యాగింగ్ రక్కసిలా కనిస్తోంది. యూనివర్సిటి కాలేజీలో చదువుతున్న బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యతో వార్తల్లో నిలిచింది. చదువుకుందామని యూనివర్సిటికి వస్తే.. అక్కడ సీనియర్ల చేసిన ర్యాగింగ్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కాలేజీలో సీనియర్లతో పాటు అక్కడ పనిచేస్తున్న వార్డెన్, ప్రిన్సిపాల్ లు కూడా పరోక్షంగా కారణమయ్యారు. ఇలా రిషితేశ్వరి ఘటన మరువక ముందే మరో ర్యాగింగ్ కేసు నమోదైంది. తనను కాలేజీలో ర్యాగింగ్ చేస్తున్నారని ఓ జూనియర్ విద్యార్థి ఫిర్యాదు చేశారు.

{yotube}=1oeayGzIuvA|620|400|1{/youtube}

ర్యాగింగ్ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం... ర్యాగింగ్ చెయ్యడానికి అందరూ భయపడేలా చట్టాలు తీసుకువస్తాం.. ర్యాగింగ్ అనే పదం పలకడానికి కూడా భయపడేలా ఏపి ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని అసెంబ్లీ సాక్షిగా గంటా శ్రీనివాస్ ప్రకటించారు. కానీ అదేదీ నిజంగా జరగడం లేదని క్లీయర్ గా అర్థమవుతోంది. మంత్రిగారు ఎంత మాట్లాడినా కానీ ఆచరణలో మాత్రం శూన్యమే అని అర్తమయ్యేలా తాజా ఘటన నాగార్జున యూనివర్సిటలో చోటుచేసుకుంది. డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న ఓ విద్యార్థిని తనను ర్యాగింగ్ చేస్తున్నారంటూ సీనియర్ల మీద నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో నాగార్జునలో ర్యాగింగ్ భూతానికి ఇంకా ఎండ్ కార్డ్ పడలేదని స్పష్టమవుతోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ragging  Nagarjuna University  Police  Ganta Srinivas  Rishiteshwari  Suicide  

Other Articles