Injection Psycho Lady Enters With Man | Student Attacked By Psycho | West Godavari Controversies

Injection psycho lady enters with man attacked student west godavari controversy

injection psycho, injection psycho lady, student attacked by psycho, psycho injection attacks, injection attacks, injection psycho special news

Injection Psycho Lady Enters With Man Attacked Student West Godavari Controversy : A Student Complaint On Injection Psycho. A Lady Also Attacked On Him With That Psycho.

సూదిగాడితోపాటు ‘సూది లేడీ’ ఎంట్రీ..!

Posted: 09/03/2015 10:49 AM IST
Injection psycho lady enters with man attacked student west godavari controversy

ఎక్కడినుంచి వచ్చాడో తెలీదు.. ఎక్కడుంటాడో తెలీదు.. అతని లక్ష్యం ఏమిటో కూడా తెలీదు.. కానీ వరుసగా సూదులతో గుచ్చుతూ ప్రజల్ని హడలెత్తిస్తున్నాడు. తొలుత ఒంటరి మహిళల్ని లక్ష్యం చేసుకుని వరుసగా దాడులు చేసిన ఆ సూదిగాడు.. రెండుమూడు రోజుల విరామం తర్వాత పురుషులపై దాడి చేయసాగాడు. ఓ సందర్భంలో ఆటోలో వెళుతూ డ్రైవర్ పై ఎటాక్ చేయగా.. మరో సందర్భంలో లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిపైనే దాడి చేశాడు. ఇతనిని అదునుగా తీసుకుని మరో ఇద్దరు సూదిగాళ్లు కూడా ఎంట్రీ ఇచ్చారు. అయితే.. వారి ఆటను పోలీసులు కట్టడి చేయగలిగారు కానీ.. అసలైన సూదిగాడ్ని ఇంకా పట్టుకోలేకపోయారు. అతగాడి ఆచూకీ కోసం పోలీసులు రాత్రింబవళ్లు కష్టపడుతుంటే.. ఇంతలోనే వారిని మరింత ముచ్చెమటలు పట్టించేందుకు ‘సూదిలేడి’ కూడా ఎంట్రీ ఇచ్చిందని సమాచారం.

నిన్నటిదాకా సైకో ‘సూది’గాడి దాడులతో అట్టుడికిన ఉభయగోదావరి జిల్లాలకు మరింత వణించేందుకు ‘సూదిలేడి’ ఎంట్రీ ఇచ్చేసింది. ఇప్పటికే సూదిగాడ్ని పట్టుకునేందుకు రాత్రింబవళ్లు నిద్రాహారాలు మాని గాలిస్తున్న రెండు జిల్లాల పోలీసులకు ‘సూది లేడి’ ఎంట్రీ అయినట్లుగా ఓ బాధితుడి నుంచి ఫిర్యాదు అందింది. తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోట పాలిటెక్నిక్ విద్యార్థిపై మహిళా సైకోతోపాటు సూదిగాడు సిరంజీ దాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు తనపై సైకో జంట సిరంజీ దాడి చేసినట్లు బాధిత విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో.. బాధితుడి నుంచి సమాచారం సేకరించిన పోలీసులు.. సైకో జంటకు సంబంధించిన ఊహాచిత్రాలను విడుదల చేశారు. వారిరువుర్ని పట్టుకోవడం కోసం గాలింపు చర్యలను వేగవంతం చేశారు. ఇదిలావుండగా.. తాజాగా జరిగిన ఈ దాడితో సైకో దాడికి గురైన బాధితుల సంఖ్య 20కి చేరింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : injection psycho lady  women attacked by psycho  psycho killers  

Other Articles