Video clip showing allegedly drunk cop in Delhi Metro goes viral

Drunk cop hits the floor in delhi metro compartment

Drunk cop, drunk cop video, drunk cop Delhi Metro, Delhi Metro, DMRC, Delhi Metro rail, delhi police, drunk cop, funny video

A video clip showing an allegedly drunk policeman travelling in the Delhi Metro has gone viral on social media, raising concerns about safety of the commuter.

ITEMVIDEOS: నెట్ లో ఢిల్లీ పోలీస్ హల్ చల్.. వీక్షించండి..!

Posted: 08/23/2015 06:40 PM IST
Drunk cop hits the floor in delhi metro compartment

మన దేశ రాజధాని ఢిల్లీ పోలీసుల వైఖరి రానురాను అక్కడి అప్ ప్రభుత్వం అరోపించినట్లుగానే చర్చనీయాంశంగా మారింది. లంచం ఇవ్వలేదని ఓ మహిళపై దాడి చేసిన కానిస్టేబుల్.. ఓ ఇంట్లో తన కూతురు వయస్సున్న పనిమనిషిని తన తుపాకీతో పాయింట్ బ్లాంక్ లో పెట్టి మరీ అత్యాచారం చేసిన ఏఎస్ఐ, ఇలా అనేక ఘటనలు చోటుచేసుకోవడం కూడా ఇందుకు కారణం అవుతున్నాయి. అసలే దేశ రాజధానిలో మహిళలపై అఘయిత్యాలు నానాటికీ పెరుగుతున్న క్రమంలో.. ముందస్తుగా అప్రమత్తంగా వుండాల్సిన పోలీసులు వ్యవహార శైలీపై అక్కడి ప్రభుత్వమే పెదవి విరుస్తున్న క్రమంలో మరో పోలీసు వీడియో నెల్ లో హల్ చల్ చేస్తుంది.



ఫుల్లుగా మధ్యం సేవించాడు.. మెట్రో రైలు ఎక్కాడు. సీటు దోరకలేదనుకుంటా.. నిల్చునే వున్నాడు. అయితే అప్పటికే అతి కష్టం మీద నిలబడ్డాడు. స్టేషన్ దగ్గరకు రాగానే రైలు అగింది. అయితే రైలు ఆగిన వేగానికి పోలీసు తూలి కిందపడ్డాడు. దీంతో పక్కనే వున్న ప్రయాణికులు అయ్యే అంటూ అతన్ని పైకి లేపారు. ఫరావా నహీ, పరవా నహీ అంటూనే అతికష్టం మీద లేచి నిలబడ్డాడు. ఇక చేతిలో సెల్ ఫోన్ ఉన్న మన నెట్ జనులు ఊరుకుంటారా..? ఆ తతంగాన్నంతా తమ ఫోన్ లలో బంధించి వాటిని నెట్ లో అప్ లోడ్ చేయడం.. ఆ వీడియో ఇప్పుడు అంతర్జాలంలో హల్ చల్ చేయడం చకచకా జరిగిపోయాయి. అయితే ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు మాత్రం యధావిధిగా వీడియోను పూర్తిగా పరిశీలించిన తరువాత విచారణ చేపడతామని చెప్పుకోచ్చారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi Metro rail  delhi police  drunk cop  funny video  

Other Articles