Nanded | express | accident | Bangalore

Lorry collides with bangalore nanded express and congress lawmaker among 6 dead

Nanded, express, accident, Bangalore-Nanded Express, Granite lorry, Nanded Express accident in Andhra Pradesh, Andhra Pradesh train accident

Lorry Collides With Bangalore Nanded Express and Congress Lawmaker Among 6 Dead Six people have died and eight others are injured after a lorry collided with the Bangalore-Nanded Express in Andhra Pradesh's Anantapur district early this morning. Karnataka Congress legislator from Devadurg, Venkatesh Naik, is among the people who were killed in the accident.

లారీని ఢీ కొట్టిన నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌.. ఆరుగురు మృతి

Posted: 08/24/2015 07:42 AM IST
Lorry collides with bangalore nanded express and congress lawmaker among 6 dead

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం మడకశిర రైల్వేగేటు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రైలు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. గ్రానైట్‌ తో వెళుతున్న ఓ లారీ అదుపు తప్పి మడకశిర లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ హెచ్‌1 బోగిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గ్రానైట్‌ రాయి రైలు బోగిపై పడిపోయి దెబ్బతింది. ఈ సంఘటనలో మరో రెండు బోగీలు పక్కకు పడిపోయాయి. లారీ డ్రైవరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుల్లో  కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లా దేవదుర్గ్‌ ఎమ్మెల్యే వెంకటేష్‌నాయక్‌లు ఉన్నారు.అనంతపురం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సీఎం మంత్రి పరిటాల సునీత, జిల్లా కలెక్టరు, ఎస్పీలతో మాట్లాడారు. సీఎం ఆదేశంలో జిల్లా అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

మడకశిర రైల్వేగేటు దగ్గర నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఓ గ్రానైట్‌ లారీని ఢీకొట్టిన ప్రమాదంలో రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పాయి. 6గురు మృతి చెందగా 8 మంది  తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు వైద్యులు. రైలు బెంగళూరు నుంచి నాందేడ్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ట్రైన్‌లో ఎస్‌ 1, ఎస్‌ 2 బోగిలు బాగా దెబ్బతిన్నాయని. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. నాందేడ్‌ ఎక్స్ ప్రెస్‌ ప్రమాదానికి గురికావడంతో బెంగళూరు- గుంతకల్లు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. షోలాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ను కల్లూరులో. ముంబయి- బెంగళూరు ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌ను తాడిచెర్లలో, బీదర్‌-యశ్వంత్‌పూర్‌ రైలును గార్లదిన్నెలో, నిజాముద్దీన్‌- బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను అనంతపురంలో నిలిపివేశారు. రైల్వే అధికారులు వచ్చి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles