It is a crime against the nation - Pawan Kalyan

Pawan to declare war against ap government

pawan kalyan, Janasena, land aquisition issue, land pooling, AP capital, amaravathi region, twitter, Ramjethmalani, speculations, Pawan land acquisition, Pawan land pooling, pawan ram jetmalani, pawan ap land pooling, It is a crime against the nation - Pawan Kalyan

Pawan Kalyan, who is from the very beginning, extended his support to the TDP party, opposing it, will obviously show a great impact on the party and its leaders.

టీడీపీతో సమరానికి సై అంటున్న పవన్.. రాజధాని గ్రామాల్లో పర్యటన

Posted: 08/22/2015 09:34 PM IST
Pawan to declare war against ap government

జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీతో పోరుకు సమాయత్తమవుతున్నారా..? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. నవ్యాంధ్ర రాజధాని ప్రాంత రైతులకు తాను అండగా వుంటానని, తమ భూములను బలవంతంగా ప్రభుత్వం లాక్కునేందుకు వీలు లేకుండా అడ్డు నిలబడతానని గతంలో హామీ ఇచ్చిన ఆయన అదే విషయమై సామాజిక మాద్యమం ద్వారా స్పందించినా.. ప్రభుత్వం నుంచి సరైన ప్రతిస్పందన రాకపోవడంతో మండిపడుతున్నారు. అంతేకాదు. తన వ్యాఖ్యలపై మెలికలు పెట్టడం, వ్యంగాస్త్రాలు సంధించడం చేసిన నేతలకు కన్నవిప్పు కల్పించాలని భావిస్తున్నట్లు వున్నారు. అందుకే గత రెండేళ్లుగా టీడీపీతో చెలిమికి గుడ్ బై చెప్పనున్నారు.

షూటింగ్ రద్దు చేసుకుని హైదరాబాదు చేరుకున్న పవన్ ఓ ట్వీట్ తో తనలో పెల్లుబుకుతున్న ఆవేశాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. సొంత అభిప్రాయానికి బదులు విఖ్యాత న్యాయవాది రామ్ జెఠ్మలానీ కామెంట్లను ట్విట్టర్లో పోస్టు చేశారు. "ఓ రాజకీయ పార్టీ జాతి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నంత కాలం దానికి మద్దతివ్వడం ధర్మం. అయితే, ఆ రాజకీయ పార్టీ విధానాలు, చర్యలు జాతికి విఘాతం కలిగిస్తున్నప్పుడు కూడా ఆ పార్టీకి మద్దతివ్వడం జాతికి ద్రోహం తలపెట్టడంతో సమానం. రాజకీయాల్లో ఎల్లప్పుడూ జాతి ప్రయోజనాలే పరమావధిగా ఉండాలి" అన్న రామ్ జెఠ్మలానీ అభిప్రాయాలను పవన్ ట్విట్టర్లో పోస్టు చేశారు.

దీంతో టీడీపీ జాతి ప్రయోజనాలను కాపాడుతుందని అనుకున్నంత వరకు ఆ పార్టీతో జతకట్టడంలో తప్పులేదని, అయితే రాజధాని పేరుతో వేల ఎకరాల భూములను సేకరించడం, అందులోనూ బహుళ పంటలను పండించే భూములను బలంవంతంగా లాక్కోవడం సరికాదని ఇది జాతి ద్రోహమేనని అయన భావిస్తున్నారు.  దీన్నిబట్టి చూస్తుంటే పవన్ కల్యాణ్ ఏపీలో అధికార టీడీపీతో పోరాటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. రేపు నవ్యాంధ్ర రాజధాని ప్రాంతాల్లో పవన్ పర్యటిస్తున్నారు.

అయితే గత నెల రోజులుగా సామాజిక మాధ్యమం ద్వారా పవన్ తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నా.. రాజధాని ప్రాంతంలో వున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. తన మెసేజ్ లపై స్పందించకపోవడం.. పైపెచ్చు ఆయన మంత్రివర్గంలోని సభ్యులు మాత్రం మెలికలు పెట్టడం, వ్యంగస్త్రాలు సంధించడం చేయడంతో పవన్ అధికార పార్టీతో పోరుకు సిద్దమయ్యారు. తెగవరకు లాగిన తరువాత.. అతికించి మాత్రం ప్రయోజనమేముంది. అందులోనూ సీనియర్ నాయకుడు, మంతరి యనమల వ్యంగాస్త్రాలు సంధించడంపై మండిపడ్డ పవన్.. ఇక రాజధాని ప్రాంత రైతులు కోసం టీడీపీపై పోరుబాటు సిద్దమవుతున్నారని తెలుస్తోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  land aquisition issue  AP capital  twitter  Ramjethmalani  

Other Articles