unidentified man thrown stone at pawan kalyan

Pawan visit ap capital area villages talks with farmers

pawan kalyan, Janasena, land aquisition issue, unidentified man thrown stone at pawan kalyan, land pooling, AP capital, amaravathi region, twitter, Ramjethmalani, speculations, Pawan land acquisition, Pawan land pooling, pawan ram jetmalani, pawan ap land pooling, It is a crime against the nation - Pawan Kalyan

Pawan Kalyan, who extended his support to the farmers of AP capital amaravathi area, visits land aquisition village farmers, unidentified man thrown stone at power star

పవన్ కల్యాన్ పై రాయి విసిరిన గుర్తుతెలియని అగంతకుడు

Posted: 08/23/2015 01:50 PM IST
Pawan visit ap capital area villages talks with farmers

నవ్యాంధ్ర రాజధాని ప్రాంత రైతులకు తాను అండగా వుంటానని, వారి భూములను బలవంతంగా ప్రభుత్వం లాక్కుంటే తాను అడ్డపడతానని ముందునుంచి చెబుతూవస్తున్న ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇవాళ రాజధాని ప్రాంతం అమరావతి గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం హాయ్ లాండ్ నుంచి రాజధాని గ్రామాల్లోకి వెళ్లిన ఆన ముందుగా గుంటూరు జిల్లా పెనమాక గ్రామంలో రైతులతో మాట్లాడేందుకు వెళ్లారు. పవన్ కళ్యాన్ వేదికపైకి రాగానే గుర్తు తెలియని ఆగంతకుడు పవర్ స్టార్ పైకి రాయి విసిరాడు.

అదృష్టవశాత్తు రాయి పవన్ కల్యాన్ కు తగల్లేదు. ఆయనకు ఎలాంటి హాని కలుగలేదు. తన సమీపానికి వచ్చిన ఆ రాయిని పవన్ కాసేపు అలాగే పట్టుకుని కూర్చుని రైతులు చెప్పేది వింటూ వచ్చారు. ఈ సంఘటనతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే పోలీసులు, జనసేన కార్యకర్తలు జనాన్ని నియంత్రించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే పవన్ కల్యాన్ మాత్రం రాయి గురించి పట్టించుకోకుండా రైతులుతో మాట్లాడుతూనే వున్నారు. ఆయన అలా హుందగా ప్రవర్తించి వుండకపోతే పెనమాక గ్రామంలో భీతావహ వాతావరణం అలుముకునేదని, ఇది పవన్ కల్యాన్ ను రెచ్చగొట్టేందుకే జరిగిన చర్య అని పలువరు రైతులు అంటున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  land aquisition issue  AP capital  unidentified man  stone  

Other Articles