Lalu mocks 'fat' Amit Shah, asks where is black money

Amit shah trapped inside lift government says due to overloading

Amit Shah, Lalu Prasad Yadav, Narendra Modi, Patna, Bihar, 2015 Bihar Assembly Elections, Amit Shah lift incident, Z+ security, Union Minister, The situation, The Doors, State Guest House, state government, state BJP chief

BJP President Amit Shah and three other senior party leaders were trapped inside a lift of the state guest house here for around 40 minutes, an incident which triggered a blame game between the saffronBSE -2.46 % party and the Nitish Kumar government which attributed it to overloading

మోదీ మిమిక్రీ తరువాత అమిత్ షాపై లాలూ వ్యంగాస్త్రాలు..

Posted: 08/22/2015 06:31 PM IST
Amit shah trapped inside lift government says due to overloading

ఫ్రధాన మంత్రి నరేంద్రమోడీ బీహార్ పర్యటనలో భాగంగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన వ్యవహారా శైలిని.. ఆ తీరును మిమిక్రీ చేసిన చూసిన తరువాత బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా లిప్ట్ లో ఇరుక్కుపోవడంపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనదైన శైలిలో స్పందించారు. అమిత్ షా లావుగా ఉండటం వల్లే లిఫ్ట్ పాడైందని ఆయన చలోక్తులు విసిరారు. లావుగా ఉన్న వాళ్లు అసలు లిఫ్టే ఎక్కొద్దని సలహా ఇచ్చారు. అమిత్ షా లిఫ్ట్ ఎక్కకుండా ఉండాల్సిందని లాలూ చెప్పారు. కెపాసిటీ ఎక్కువైన కారణంగానే లిఫ్ట్ పాడైందని చెప్పుకొచ్చారు. బీహార్‌లో లిఫ్టులు చిన్నవని, అమిత్ షా లాంటి లావువాళ్లను అవి మోయలేవన్నారు.

లావుగా వున్నావాళ్లు.. లిఫ్ట్ కాకుండా మెట్లను వినియోగిస్తే.. ఉభయ కుశలోపరిగా వుంటుందని ఆయన వ్యంగ్రాస్త్రాలను సందించారు. దీంతో అమిత్ షా కాస్త సన్నబడతారని, రెండు తమ రాష్ట్ర లిప్టులు పాడవ్వకుండా వుంటాయని చెప్పారు. కాగా, లాలూ వివాదాస్పద వ్యాఖ్యలపై బిజెపి మండిపడింది. సున్నితమైన అంశాలపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. నితీశ్ కుమార్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని కమలనాథులు మరోసారి ఆరోపించారు. పాట్నా ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లో బస చేసిన అమిత్ షా రాత్రి పదకొండున్నరకు లిఫ్టులో ఇరుక్కుపోయారు. అరగంటపాటు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సిఆర్‌పిఎఫ్ జవాన్లు లిఫ్టు తలుపులు బద్దలు కొట్టి అమిత్ షాను సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amit Shah  Lalu Prasad Yadav  Narendra Modi  Patna  Bihar  

Other Articles