we will meet pawan kalyan on land pooling says kalva srinivasulu

Team of ministers likely to go to pawan kalyan for mediation

pawan kalyan, Janasena, mediation, team of apministers, land aquisition issue, land pooling, AP capital, amaravathi region, kalva srinivasulu, speculations, Breaking news, general, politics, sport, entertainment, lifestyle, weird, world, india news, entertainment news, national news, telugu news

Amid speculations over team of ministers likely to go to pawan kalyan for mediation on land aquisition issue in AP capital amaravathi region kalva srinivasulu statements support it

పవన్ కల్యాన్ ను ఒప్పంచేందుకు రంగంలోకి మంత్రుల బృందం..?

Posted: 08/22/2015 05:58 PM IST
Team of ministers likely to go to pawan kalyan for mediation

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత రైతులకు అండగా నిలబడి.. ప్రభుత్వ భూసేకరణను వ్యతిరేకిస్తున్న జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాన్ తో మధ్యవర్తిత్వం నిర్వహించేందుకు టీడీపీ ప్రభుత్వం సిద్దమైంది. రాజధాని విషయంలో ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ.. తమ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్న  పవన్ కల్యాణ్ వద్దకు మంత్రుల బృందాన్ని పంపాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. అవసరమైతే స్వయంగా తాను కూడా పవన్తో భేటీ కావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

రాజధాని నిర్మాణం కోసం రైతుల వద్ద నుంచి బలవంతంగా భూసేకరణ చేయొద్దని పవన్ ముందునుంచి చెబుతున్నారు. ప్రభుత్వం బలవంతంగా భూములను లాక్కుంటే.. తాను అమరణ నిరాహార దీక్షకు కూడా పూనుకుంటానని గతంలోనే హెచ్చరించారు. అయినా ప్రభుత్వం తమ ఫంథా విడకుండా ల్యాండ్ పుల్లింగ్, భూ సేకరణ పద్దతులతో ముందుకెళ్లడంతో త్వరలోనే తాను మరోమారు ల్యాండ్ పుల్లింగ్ జరుగుతున్న గ్రామాల్లో పర్యటిస్తానని తాజాగా ట్వీట్లలో చెప్పారు. పవన్ ట్విట్లపై  కొందరు మంత్రులు మెలిక పెట్టగా మరికోందరు విమర్శలకు దిగారు. దీంతో వారిపై అంతకు రెట్టింపు స్థాయిలోనే సమాధానం ఇచ్చారు పవన్. పవన్ పవర్ పంచ్ ధాటికి తొకముడిచిన నేతలు ఇక రాజీ యత్నాలకు తెరతీశారు.

వివాదం క్రమంగా ముదురుతోందని భావించిన చంద్రబాబు.. మంత్రుల బృందాన్ని పవన్ వద్దకు పంపుతున్నారు. ఆయన మరోసారి బేతపూడి, పెనుమాక, ఉండవల్లి తదితర గ్రామాలకు వెళ్తే రైతుల నుంచి ఉద్యమం మొదలు కావచ్చని, దానికి పవన్ మద్దతు ఇచ్చి తీరుతారని అనుకుంటున్నారు. భూసేకరణకు తీవ్రస్థాయిలో అన్నాహజారే, మేధాపాట్కర్ లాంటి వాళ్లనుంచి కూడా విమర్శలు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా మొండిగా ముందుకెళ్తోంది. దానిపైనే పవన్ ఇప్పుడు స్పందించడం చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టింది. పవన్ను రాజీమార్గంలోకి తెచ్చుకుని భూసేకరణకు వెళ్తే తమకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ముందుగా మంత్రుల బృందాన్ని పంపి, ఆ తర్వాత రేపు లేదా ఎల్లుండి చంద్రబాబు కూడా పవన్తో భేటీ కావచ్చని అంటున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  TDP ministers  mediation  land acquisition  

Other Articles