AP | ragging | Students | Chandrababu Naidu

A govt facing alligations about the ragging on students

AP, ragging, Students, Chandrababu Naidu, Rishiteshwari, kadapa, Tirupati

A govt facing alligations about the Ragging on students. Ragging cases number is raning danger bells to ap govt.

ఏపి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న ర్యాగింగ్

Posted: 08/21/2015 03:15 PM IST
A govt facing alligations about the ragging on students

వరుస ర్యాగింగ్‌ ఘటనలు, విద్యార్ధినుల ఆత్మహత్యలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నాగార్జున వర్శిటీలో ఆర్కిటెక్చర్‌ విద్యార్ధిని రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనతో రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థలు, విశ్వ విద్యాలయాల్లో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినప్పటికీ ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతుండటం, విపక్షాలు రాష్ట్రంలో జరుగుతున్న విద్యార్ధుల ఆత్మహత్యలను తమకు అనుకూలంగా మలుచుకొని అధికార పక్షంపై దాడికి సిద్ధమవుతున్నాయి.

తాజాగా తిరపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయంలో ద్వితీయ సంవత్సరం ఎంసీఏ విద్యార్ధులు జూనియర్‌ విద్యార్ధులను ర్యాగింగ్‌కు గురి చేసిన వ్యవహారంలో ఏడుగురిని సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. గత 15 రోజులుగా సీనియర్‌ విద్యార్ధులు కొత్తగా చేరిన ప్రధమ సంవత్సరం ఎంసీఏ విద్యార్ధులను తరచూ వేదింపులకు గురి చేస్తున్నారని, రాత్రివేళల్లో ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంలో వెంటనే రంగంలోకి దిగిన మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. బాద్యులైన విద్యార్ధులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని విశ్వ విద్యాలయ ఉప కులపతిని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే కడప జిల్లా కేంద్రంలోని ఓ కార్పోరేట్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న ఇద్దరు మహిళ విద్యార్ధినులు హాస్టల్‌ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఉదయం తరగతులకు హజరయ్యే సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఈ ఇరువురు విద్యార్ధినులు తాముంటున్న హాస్టల్‌ గదిలో వేర్వేరుగా ఆత్మహత్యలకు పాల్పడడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ మంత్రికి చెందిన సదరు కళాశాలలో విద్యార్ధినులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విపక్ష నేత జగన్‌ మోహన్‌రెడ్డి ఆరోపించారు. మంత్రికి సంబందించిన కళాశాలల్లో ఇప్పటి దాకా 11 మంది విద్యార్ధులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన యాజమాన్యంపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

రిషితేశ్వరి ఆత్మహత్య ఘటన తర్వాత ఏపీలోని అన్ని విశ్వ విద్యాలయాలు, ప్రధాన విద్యా సంస్థల్లో బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయాలని, హాస్టళ్ళల్లో సీసీ కెమేరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల 31వ తేదీలోపు వీటి ఏర్పాటును పూర్తయ్యేలా చూడాలని సంబందింత ఉప కులపతులను ప్రభుత్వం కోరింది. ఇప్పటిదాకా రాష్ట్రంలోని ఒకటి, రెండు విశ్వ విద్యాలయాలు మినహా ఎక్కడ బయోమెట్రిక్‌, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన దాఖలాలు కనిపించడంలేదని ప్రభుత్వానికి సమాచారం అందింది. శ్రీ వేంకటేశ్వర వర్శిటీలో తాజాగా చోటు చేసుకున్న ర్యాగింగ్‌ ఘటనలో సస్పెన్షన్‌కు గురైన విద్యార్ధులను రక్షించేందుకు ఓ ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన నేతలు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో ఎంతటి వారున్నా ఉపేక్షించవద్దని వారిని కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు జిల్లా పోలీస్‌ యంత్రాంగాన్ని ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  ragging  Students  Chandrababu Naidu  Rishiteshwari  kadapa  Tirupati  

Other Articles