BSF | boarder | Security | Army

Women officers to be inducted for first time in bsf

BSF, boarder, Security, Army, Lady Jawans, India, Indian Force

Women officers to be inducted for first time in BSF In a major step aimed to empower women in `khaki`, the government for the first time has given its nod for recruitment and commissioning of women officers in a border guarding force-- the BSF.

అమ్మాయిలు... ఆయుధాలు... సరిహద్దు

Posted: 08/21/2015 03:12 PM IST
Women officers to be inducted for first time in bsf

సరిహద్దుల్లో కాల్పుల మోత మోగుతూనే ఉంది. ప్రత్యర్థులు మన సైనికుల మీద వరుస దాడులకు తెగ పడుతూనే ఉన్నారు. మన భద్రతా బలగాలు వారికి ఎదురొడ్డి నిలుస్తన్నారు. అయితే తాజాగా సరిహద్దు భద్రతా బలగాలలో ఆడవాళ్ల రిక్రూర్ మెంట్ వార్తల్లో నిలుస్తోంది. BSF బలగాలు చరిత్ర సృష్టించాయి. తొలిసారి BSFలోని మహిళా విభాగం బోర్డర్ లో సెక్యురిటీ నిర్వహించింది. సౌత్ ఫ్రాంటీయర్ బెంగాల్ కు చెందిన మహిళా సిబ్బంది ఇండియా – బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పేట్రోలింగ్ చేశారు. స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో టెర్రరిస్టులు దాడులకు పాల్పడొచ్చనే ఐబీ హెచ్చరికలతో అలర్ట్ అయిన బీఎస్ఎఫ్… విమెన్ ఫోర్స్ ను సరిహద్దు పహారాలో ఉపయోగించుకుంది.

బీఎస్ఎఫ్ లో మహిళా సిబ్బందిని ఆరేళ్ల నుంచి రిక్రూట్ చేసుకుంటున్నారు. 2009లో పంజాబ్, బెంగాల్ బోర్డర్స్ లో సెక్యురిటీ కోసం రిక్రూట్ మెంట్ మొదలు పెట్టారు. సరిహద్దు చొరబాట్లలో, ఉగ్రవాద కుట్రలలో మహిళలు చురుగ్గా పాల్గొంటున్నారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న బీఎస్ఎఫ్ అధికారులు మహిళల రిక్రూట్ మెంట్ పై దృష్టిపెట్టారు. ప్రస్తుతం 2000 మంది మహిళా సిబ్బంది బీఎస్ఎఫ్ లో ఉన్నారు. తాజాగా 27 మంది అసిస్టెంట్ కమాండ్ లను రిక్రూట్ చేసుకున్నారు. మొత్తానికి ఆడవాళ్లు ఎందులోనూ తీసుపోరు అన్న దానిని మరో సారి నిరూపిస్తున్నారు. ఇప్పటికే ఆర్మీలోని చాలా విబాగాల్లో ఉన్న ఆడవాళ్లు తాజాగా సరిహద్దు భద్రతలో కూడా పాలుపంచుకోవడం నిజంగా గ్రేట్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSF  boarder  Security  Army  Lady Jawans  India  Indian Force  

Other Articles