Groups | TPSC | Telangana | Ganta Chakrapani

Tpsc released aee notification but no clarity on groups notification

Groups, TPSC, Telangana, Ganta Chakrapani, Jobs, Govt Jobs, telangana Jobs

TPSC released AEE notification but no clarity on groups notification. TPSC grandly announce first notification but groups notification not ready to announce soon.

గ్రూప్స్ నోటిఫికేషన్ ఎన్నడో తెలుసా...?

Posted: 08/20/2015 08:22 AM IST
Tpsc released aee notification but no clarity on groups notification

తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నోటిఫికేషన్ల జారీ మొదలైంది. మొదటి నోటిఫికేషన్ ను టిపిఎస్సీ కమీషన్ విడుదల చేసింది. ఎఈఈ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తానికి అన్ని అరిష్టాలను అదిగమించి నోటిఫికేషన్ జారీ అయింది. కాగా అన్ని నోటిఫికేషన్ల కన్నా గ్రూప్స్ నోటిఫికేషన్ల మీద నిరుద్యోగులు ఎంతో ఆశగా ఉన్నారు. క్యాడర్ పరంగా, సాలరీ పరంగా హైలెవల్ లో ఉండే గ్రూప్స్ పోస్టుల భర్తీకి ఎప్పుడు ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ జారీ  అని నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే గ్రూప్స్ విషయంలో మాత్రం అనేక అడ్డంకులు ఉంటున్నాయి. సెలబస్, జోన్ లు ఇలా చాలా అంశాల మీద క్లారిటీ లేదు.

గ్రూప్-2లో 400 పైచిలుకు ఉద్యోగాలు ఉన్నాయని, కొంతకాలం ఆగితే ప్రభుత్వంనుంచి మరిన్ని ఉద్యోగాల భర్తీకి అనుమతివచ్చే అవకాశం ఉందని ఆశిస్తున్నట్లు టిపిఎస్సీ చైర్మెన్ ఘంటా చక్రపాణి తెలిపారు. కమలనాథన్ కమిటీ ఉద్యోగుల విభజనపై అక్టోబర్ చివరిలోగా రిపోర్టు ఇస్తుందని, తద్వారా మరిన్ని ఉద్యోగాల ఖాళీలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. మార్చిలోగా గ్రూప్-2 పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడి, ఇంటర్వ్యూలు కూడా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చక్రపాణి తెలిపారు. గ్రూప్-2లో ఇంటర్వ్యూ ఉంటుందని స్పష్టంచేశారు. ఆ స్థాయి క్యాటగిరీలో ఉద్యోగాలకు ఎంపికయ్యే వారి శక్తిసామర్థ్యాలను అంచనా వేసేందుకు ఇంటర్వ్యూ తప్పనిసరని అన్నారు. గ్రూప్స్ అభ్యర్థులకు న్యాయం చేయాలని రాతపరీక్ష విధానాన్ని కూడా పక్కపెట్టినట్లు వివరించారు.

భారీస్థాయిలో అవకతవకలు జరిగిన వ్యాపం, ఆలిండియా మెడికల్ ప్రవేశ పరీక్షతోపాటు తాజాగా నకిలీలు పరీక్ష రాసిన రాష్ట్ర ఎడ్‌సెట్ వంటి ఘటనల రీత్యా బయోమెట్రిక్ విధానాన్ని అవలంబించాలని కమిషన్ నిర్ణయం తీసుకున్నదని చైర్మన్ స్పష్టంచేశారు. ఈ వివరాలు ఒక్కసారి సేకరిస్తే.. ఉద్యోగం పొందిన వ్యక్తి తన సర్వీసుకాలంలో పదేపదే ఆ వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉండబోదని చెప్పారు. గత కమిషన్ల పనితీరు చూసి ప్రస్తుత కమిషన్‌ మీద నిందలు వెయ్యవద్దని, తమ పనితీరు చూసిన తర్వాతే వ్యాఖ్యానించాలని చక్రపాణి కోరారు. పరీక్షల ప్రక్రియలన్నింటిలోనూ వివాదాలు లేకుండా చేయాలనేదే కమిషన్ అభిమతమని స్పష్టంచేసిన చక్రపాణి.. అడ్డుకోవాలనే ఆలోచన ఉన్నవారిని ఏం చేయగలమని అన్నారు. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు లక్షల సంఖ్యలో అభ్యర్థులు పోటీపడే అవకాశం ఉన్నందున.. వాటికి ఆన్‌లైన్ పరీక్షా విధానం సాధ్యం కాదని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Groups  TPSC  Telangana  Ganta Chakrapani  Jobs  Govt Jobs  telangana Jobs  

Other Articles