mesmerizing | KCR | Telangana

Telangana cm kcr mesmerizing telangana people by his name

mesmerizing, KCR, Telangana, Telangana Formation, Telangana state, KCR speech, Telangana Govt, Jobs, Regularisation

Telangana cm KCR mesmerizing Telangana people by his name. After formation of telangana state, KCR using his name and mesmerizing the people.

ఏం మాయగాడివి కేసీఆర్...?!

Posted: 08/20/2015 09:15 AM IST
Telangana cm kcr mesmerizing telangana people by his name

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీని స్థాపించి ఉద్యమాన్ని పీక్స్ కు తీసుకెళ్లి చివరకు తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేశారు. అయితే ఉద్యమం నడిపే దగ్గరి నుండి కేసీఆర్ స్ట్రాటజీ చాలా డిఫరెంట్. ఉద్యమాన్ని గతంలో కన్నా దూకుడుగా.. ఎలాంటి పోరపాటులు లేకుండా నడిపించారు. అయితే ఇదంతా గతం తాజాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పూర్తి స్థాయి ఉద్యమ నాయకుడి నుండి రాజకీయ నాయకుడిగా మారిపోయారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత కేసీఆర్ కొత్త లెక్కలు వేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకోని వారిని అందలం ఎక్కించి విమర్శల పాలవుతున్నారు. అయితే ఇంతలా పార్టీలో అప్పటి వరకు వినిపించని.. కనిపించని మొహాలు తెర మీదకు వస్తున్నా కానీ తన ఇమేజ్ కు ఎలాంటి డ్యామేజ్ లేకుండా చూసుకోవడం కేసీఆర్ స్పెషాలిటి.

అవును కేసీఆర్ ఇమేజ్ కు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తన ఇమేజ్ తో తెలంగాణ, తెలంగాణ నే తన ఇమేజ్ లా ఎలా కావాలంటే అలా మారిపోతున్నారు. కేసీఆర్ ఇప్పటి వరకు ఇచ్చిన మాటలు నెరవేర్చనే లేదు. కానీ ప్రభుత్వం మీద ఎవరైనా నేతలు అసంతృప్తిగా ఉంటే మాత్రం వెంటనే ఏదో చర్య తీసుకుంటూ అప్పటికప్పుడు పరిస్థితిని తన అదుపులోకి తీసుకువస్తుంటారు. తెలంగాణ సర్కార్ లో ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ కేసీఆర్ అనుమతి లేకుండా కదిలే పరిస్థితిలేదు. తెలంగాణ సర్కార్ మొత్తానికి కేసీఆర్ వన్ మ్యాన్ షో నడుపుతున్నారని ఒక్క మాటలో చెప్పవచ్చు. ఏ మంత్రి కానీ .. నాయకుడికి కానీ పూర్తి స్థాయి స్వేచ్ఛ లేకుండా చెయ్యడం.. ఏ నిర్ణయమైనా కానీ తన దాకా రావాల్సిందే అన్నట్లు వ్యవహరించడం విశేషం.

ఇక ఇచ్చిన మాటలు ఎన్నడో మరిచినా కానీ కేసీఆర్ మానియా మాత్ర నడుస్తోంది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని మాటిచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి కాలమైనా ఉలుకుపలుకు లేదు. ఇక రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు, నీళ్లు అన్ని అందుబాటులోకి వస్తాయి.. జీవితాలు మారిపోతాయి అని కేసీఆర్ కలల లోకాలను చూపించారు. కానీ నిజానికి అందులో ఒక్కటి కూడా చెయ్యలేదు. చేసిందల్లా ఏమైనా ఉంది అంటే అది కరెంట్ కోతలు లేకుండా చెయ్యడం. అందుకే కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా కానీ కరెంట్ కోతలు లేకుండా చూసిన ఘనత తమ ప్రభుత్వానిదే అని కాలరెగరేస్తున్నారు. మరి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెయ్యని ఘనత కూడా మా ప్రభుత్వానిదే అని కేసీఆర్ తన నోటి నుండి చెబితే కూడా బాగుటుంది. కానీ మొత్తానికి ఎంత అసంతృప్తి ఉన్నా, ఎంత వ్యతిరేకత ఉన్నా కానీ కేసీఆర్ తన ఉద్యమ మానియా ద్వారా అలా అలా మాయ చేస్తున్నారు. చూడాలి మరి ఎంత కాలం ఈ మాయ నడుస్తుందో...

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles