High court | Cabide | Fruits | Terrorists

High court pronounced that business men who is using carbide is more danger than the terrorists

High court, Cabide, Fruits, Terrorists, carbide chemical

HIgh court Pronounced that business men who is using carbide is more danger than the terrorists. High court anger on business men for using carbide for fruits.

ఉగ్రవాదుల కన్నా మీరే డేంజర్

Posted: 08/20/2015 08:15 AM IST
High court pronounced that business men who is using carbide is more danger than the terrorists

ఉగ్రవాదుల గురించి అందరికి తెలుసు. ఉగ్రవాదులు ఎంత డేంజరో, వారి అకృత్యాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా హైకోర్ట్ ఉగ్రవాదుల కన్నా మీరే డేంజర్ అంటూ వ్యాఖ్యానించడం విశేషం. ఇంతకీ ఉగ్రవాదుల కన్నా కూడా అతి ప్రమాదకరంగా మారింది ఎవరో తెలుసా..? తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించకుండా కాయలను కృత్రిమ పద్ధతుల్లో పండ్లుగా మార్చేందుకు వ్యాపారులు ప్రమాదకర కార్బైడ్ రసాయనాన్ని వాడటంపై ఉమ్మడి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కార్బైడ్ రసాయనం ప్రయోగించే వ్యాపారులు ఉగ్రవాదులకంటే ప్రమాదకారులని వ్యాఖ్యానించింది. ఉగ్రవాదులు నేరుగా వచ్చి హత్యలు చేస్తారని, కానీ పండ్ల విక్రయదారులు విషపదార్థాలను వినియోగదారుల శరీరాల్లోకి చొప్పిస్తూ దీర్ఘకాలిక అనర్థాలకు కారణమవుతున్నారని మండిపడింది.

మనిషి నాడీ వ్యవస్థపై కార్బైడ్ తీవ్ర ప్రభావం చూపుతుందని, వ్యాపారులు అత్యాశతో చేస్తున్న ఈ పని భావితరాలను బలహీనపర్చటమేనని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బీ భోసలే, జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం పేర్కొంది. మార్కెట్లలో విక్రయిస్తున్న అన్ని రకాల ఫలాల్లో 90శాతానికిపైగా కార్బైడ్‌ను ఉపయోగించినవేనంటూ పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా మార్కెట్లలో తనిఖీలు నిర్వహించి నివేదికలు ఇవ్వాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలను ధర్మాసనం గతంలో ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌తోపాటు, హైదరాబాద్‌లో మరో మూడు మార్కెట్లలో తనిఖీలు నిర్వహించిన తెలంగాణ అధికారులు, కార్బైడ్ వినియోగంపై నివేదికను బుధవారం హైకోర్టుకు సమర్పించారు. మార్కెట్లలో సేకరించిన పండ్ల శాంపిల్స్‌ను పరీక్షించి ప్రయోగశాలలు ఇచ్చిన రిపోర్టులను కూడా ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ ధర్మాసనానికి అందజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High court  Cabide  Fruits  Terrorists  carbide chemical  

Other Articles