ys jagan demands judicial inquiry into students suicide case

Students suicide ys jagan mohan reddy call kadapa bandh

ys jagan on kadapa students suicide, jagan calls kadapa bandh, jagan demands narayana arrest, re-postmortem in hyderabad, jagan demand judicial probe, jagan on students suicide, YS Jagan, kadapa, bandh, inter students suicide, narayana collage

Leader of Opposition in AP assembly YS jagan mohan reddy demands judicial probe and repostmortem in students suicide case

రేపు కడప జిల్లా బంద్.. న్యాయవిచారణ జరిపించాలని విపక్షనేత డిమాండ్

Posted: 08/18/2015 06:57 PM IST
Students suicide ys jagan mohan reddy call kadapa bandh

కడప జిల్లాలోని నారాయణ కాలేజీలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విద్యార్థినుల ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థినుల కుటుంబాలకు న్యాయం చేయాలన్న డిమాండ్ తో బుధవారం కడప నగరం బంద్ కు పిలుపునిచ్చారు. విద్యార్థినుల మృతదేహాలకు హైదరాబాద్ లో రీపోస్టుమార్టం నిర్వహించాల డిమాండ్ చేశారు. కడప రిమ్స్ ఆస్పత్రి వద్ద విద్యార్థినుల తల్లిదండ్రులను మంగళవారం వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడారు.

సీఎం చంద్రబాబు మంత్రి నారాయణను తన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి.. ఈ ఘటనపై విచారణ జరిపించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 మాసాల్లో నారాయణ కాలేజీల్లో 11 మంది విద్యార్థులు మృతి చెందారని వారిలో 9 మంది అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలని.. జగన్ అరోపించారు. ఇంత మంది మరణాలకు కారణమైన నారాయణ కాళాశాల డైరెక్టర్ మంత్రి నారాయణకు తక్షణం అరెస్టు చేయాలని జగన్ డిమాండ్ చేశారు. ఇంత మంది విద్యార్థులు చనిపోతున్నారంటే.. ఇది జూనియర్ కాలేజీయా..? లేక ఆత్మహత్యలను ప్రేరేపించే కాలేజీయా..? అని ఆయన తీవ్రస్థాయిలో నిలదీశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటిస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని, అయినా ఆయన కనీసం విద్యార్థుల తల్లిదండ్రులను పరామర్శించలేదని అన్నారు. చనిపోయిన పిల్లల ఆత్మహత్యలను కూడా తమకు సంబంధం లేదన్నట్లుగా చేసే విధంగా కాలేజ్ యాజమాన్యం ప్రయత్నిస్తుందని, టెన్త్ పాస్ అయ్యి మూడు నెలలు కూడా కానీ విద్యార్థులు మరణాలకు ప్రేమ వ్యవహారమే కారణమంటూ కొత్తగా లవ్ లెటర్ సృష్టించారని, విద్యార్థినుుల రాయని లేఖలను చూపిస్తున్నారని, అభంశుభం తెలియని పిల్లలపై అభాండాలు వేయడం ఎంతవరకు సమంజసని జగన్ ప్రశ్నించారు. విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలన్న డిమాండ్ తో రేపు జిల్లా బంద్ కు జగన్ పిలుపునిచ్చారు

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  kadapa  bandh  inter students suicide  narayana collage  

Other Articles