OROP row: Delhi Police apologise to ex-servicemen for Aug 14 crackdown

Orop delhi police says sorry pmo steps in to pacify agitating ex servicemen

One Rank One Pension,Independence Day,MK Meena,Delhi police, Delhi cops, OROP, Ex-servicemen, Jantar Mantar crackdown, strong political reaction, orop protest, ex-servicemen, armymen, jantar mantar, agitating armymen, servicemen, latest news

Joint Commissioner of Police MK Meena went to the protest venue at Jantar Mantar and apologised for the August 14 crackdown which had triggered strong political reaction as well as outrage among the former soldiers.

మమ్మల్నీ క్షమించరూ.. మాజీ సైనికులతో ఢిల్లీ పోలీసులు..

Posted: 08/18/2015 07:00 PM IST
Orop delhi police says sorry pmo steps in to pacify agitating ex servicemen

మమ్మల్ని క్షమించండి.. మీ పట్ల మాకు ద్వేషం లేదు. మీరంటే గౌరవం. మేము మీతోనే ఉంటాం. మీపై మా చర్యలకు చింతిస్తున్నాం'   అని మాజీ  సైనికోద్యోగులపై ఢిల్లీ పోలీస్ అధికారి ఎంకే మీనా  ప్రేమ కురిపించారు. గత శుక్రవారం(ఆగస్టు14)నాడు  వన్ ర్యాంక్-వన్ పెన్షన్(ఒకే హోదా-ఒకే పింఛను) పథకాన్ని తక్షణమే ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ మాజీ సైనిక ఉద్యోగులు చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసు బలగాలను ప్రయోగించి బలవంతంగా భగ్నం చేయడంపై మీనా ఆవేదన వ్యక్తం చేశారు.

తమకు సైనిక వ్యవస్థ అంటే విపరీతమైన గౌరమని పేర్కొన్నారు.  ప్రస్తుతం ఆర్మీలో ఉన్న వారైనా.. రిటైర్మెంట్ తీసుకుని విధులకు దూరంగా ఉన్న వారైనా తమకు అమితమైన భక్తి భావముందని తెలిపారు. కేవలం కొన్ని అనివార్య పరిస్థితుల్లో వారిపై బలప్రయోగం చే్యాల్సి వచ్చినందుకు చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. వన్ ర్యాంక్- వన్ పెన్షన్ పై రక్షణ మంత్రి మనోహర్ పరికర్ స్సష్టమైనా హామీ ఇచ్చినా.. వారు తమ నిరసనను తీవ్రం చేయడంతోనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. ఆగస్టు 24 వరకూ మాజీ సైనికోద్యోగులను తమ నిరసనను వాయిదా వేయమని పారికర్ తెలిపారన్నారు.ఈ స్కీమ్ పై ఆగస్టు 23 వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నందున అప్పటి వరకూ నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేయాలని మాజీ సైనికోద్యుగులకు పారికర్ భరోసా ఇచ్చిన సంగతిని మీనా ఈ సందర్భంగా ప్రస్తావించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi cops  OROP  one rank one pension  Ex-servicemen  

Other Articles