bitter news to teacher job Aspirants of telangana

No dsc this year kadiyam srihari

bitter news to teacher job Aspirants, no dsc this year says kadiyam srihari, deputy chief minister kadiyam srihari, bitter news, teacher job Aspirants, telangana, Telangana government

Telangana deputy chief minister kadiyam srihari declares that no dsc in this year, announcement brings bitter news to teacher job Aspirants of telangana

ఉపాధ్యాయ ఉద్యోగ ఆశావహులకు చేదు వార్త.. ఈ ఏడాది డీఎస్సీ లేదట..

Posted: 08/12/2015 04:09 PM IST
No dsc this year kadiyam srihari

ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలనుకుంటున్న ఆశావహులకు చేదువార్తను అందించింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎంతో ఆసక్తిగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న ఆశావహులను నిరాశపర్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ, టెట్ రెండు పరీక్షలను ఏకకాలంలో నిర్వహించిన తరువాత తెలంగాణ ఉపాధ్యాయ అశావహులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తుంగా వారి నోట్లో పచ్చివెలక్కాయ పడినట్లు చేసింది ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. ఈ ఏడాది డీఎస్సీ లేనట్లేనని చెప్పారు.

 బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఈ సంవత్సరం ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలు ఉండవని, డీఎస్సీ లేదని శ్రీహరి స్పష్టం చేశారు. వచ్చే ఏడాది చర్చించిన తర్వాత ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.  ఇక ఉపాధ్యాయ సంఘాలకు సమస్యలు ఉన్నాయన్న విషయం తమకు తెలుసని, అయితే ఈ సమస్యలపై కూడా అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరణ ఇచ్చారు.రాష్ట్రంలో మొత్తం 182 మోడల్ స్కూళ్ల నిర్మాణాన్ని ప్రారంభించామని, వీటి ద్వారా 10, 200 మంది విద్యార్థులకు ఉచితంగా విద్యనందిస్తున్నామని అన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : teacher job Aspirants  dsc  kadiyam srihari  Telangan government  

Other Articles