Telangana RTC | Mahinder Reddy | Bus Bhavan

Telangana rtc remove some outsource employees

TC, TSRTC, Telangana RTC, Mahinder Reddy, Bus Bhavan, Outsource employees

Telangana RTC remove some outsource employees. Telangana RTC employees who were working form past several years. Employee unions are demanding to re-join that employees.

తెలంగాణ ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ ఊద్యోగుల ఊస్టింగ్

Posted: 08/12/2015 04:45 PM IST
Telangana rtc remove some outsource employees

హైదరాబాద్ బస్ భవన్ లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆర్టీసీ యాజమాన్యం ఉన్నపళంగా తొలగించారు. ఇప్పటికి ఏకంగా 67 మందిని తొలగించగా... తెలంగాణలో పనిచేస్తున్న మరో 9వేల మందిని తొలగించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీలో ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండరు.... అందరినీ పర్మినెంట్ చేయమని ఆదేశిస్తున్నా అన్న సీఎం కేసీఆర్ ప్రకటనకు విలువ లేకుండా పోయింది అక్కడ. ఆర్టీసీలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఉన్నపళంగా తొలగించింది ఆర్టీసీ. జూన్ 14 న ఆర్టీసీ కార్మికులకు 44 శాతం పీఆర్సీ ఇచ్చారు కేసీఆర్. అదే సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు.... ఆర్టీసీలో ఉండకుండా చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. కాని ఇప్పుడు జరిగింది ఇంకొకటి. నెలకు 6వేల రూపాయల వేతనంతో గత ఆరేళ్లుగా పనిచేస్తున్న 67 మందిని ఆర్టీసీ యాజమాన్యం ఉన్నపళంగా తొలగించింది. ఇందులో 52 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్స్, 13 మంది అటెండర్స్ ఉన్నారు. ఆర్టీసీ యాజమాన్య చర్యతో ఆందోళన పథం పట్టారు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.

తెలంగాణలో మొత్తం 95 డిపోలు ఉండగా....అక్కడ  9వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిని కూడా త్వరలో తొలగించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు ఎక్కువయ్యారన్న సాకు చూపి తమను తొలగించారని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మండపడుతున్నారు. మంత్రులు హరీష్ రావు, మహేందర్ రెడ్డిని కలిసినా తమకు ఎలాంటి హామీ లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వంత రాష్ట్రం వచ్చిందన్న ఆనందం తమకు మిగలకుండా చేశారని అధికారులు, నేతలపై మండిపడ్డారు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు. తమ రాష్ట్రంలో తమ ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని భావిస్తే  ఉన్న ఉద్యోగాలు ఊడాయని అన్నారు. ఇకనైనా రవాణా మంత్రి మహేందర్ రెడ్డి జోక్యం చేసుకోవాలని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TC  TSRTC  Telangana RTC  Mahinder Reddy  Bus Bhavan  Outsource employees  

Other Articles