Jagan | YSRCP | Delhi | AP

Ys jaganmohan reddy protest at jantarmantar for ap special status

AP, Special status, Jagan, YSRCP, Delhi, Jantarmantar, Protest, YSRCP

YS JaganMohan Reddy protest at Jantarmantar for ap special status. YSRCP leaders already went to delhi to participate on the protest for ap special status.

జంతర్ మంతర్ వద్ద జగన్ జగడం

Posted: 08/10/2015 08:11 AM IST
Ys jaganmohan reddy protest at jantarmantar for ap special status

ప్రత్యేక హోదా ఏపి హక్కు నినాదంతో జగన్ ఢిల్లీలో గళం విప్పబోతున్నారు. జంతర్మంతర్ దగ్గర జరగనున్న ఈ నిరసనకు మద్దతుగా ఏపీ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలను ఇప్పటికే ఢిల్లీ తరలించారు. నిరసన చేస్తోంది ఢిల్లీలో అయినా, కేంద్రంపై ఈమేరకు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నా.. ప్రత్యేక హోదా రాబట్టడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందన్న నినాదాలే అక్కడ ఎక్కువగా వినిపించనున్నాయి. ఆంధ్రప్రదేశ్కు కీలక అంశమైన ప్రత్యేక హోదాపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో గళమెత్తనుంది. రాష్ట్ర విభజన జరిగి 14నెలలు గడిచినా.. ఇంతవరకు ప్రత్యేక హోదా ఊసెత్తకపోవడంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమయ్యారు ఆ పార్టీ అధినేత జగన్. ఇందుకోసం ఇవాళ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైసీపీ అధ్వర్యంలో ఆందోళన చేయబోతున్నారు.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వైసీపీ నాయకులు జంతర్మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ఇందులో జగన్ తో పాటు.. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలంతా పాల్గొననున్నారు. ధర్నా అనంతరం వైసీపీ శ్రేణులు పార్లమెంట్ వరకు మార్చ్ నిర్వహిస్తారు. జగన్ ధర్నాలో పాల్గొనేందుకు వైసీపీ కార్యకర్తలు ఇప్పటికే హస్తిన చేరుకున్నారు. అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు కూడా తరలివెళ్లారు. వీరి సౌలభ్యం కోసం కర్నూలు, అనకాపల్లి నుంచి రెండురోజుల క్రితమే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది పార్టీ. కర్నూలు నుంచి బయల్దేరిన కార్యకర్తలను వైసీపీ ఎంపీ బుట్టా రేణుకతోపాటు నలుగురు ఎమ్మెల్యేలు కలిసి రైలు ఎక్కించారు.

ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించినా... ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. స్పెషల్ స్టేటస్ ఏపీ రైట్ అని... ఇప్పటివరకూ మాటల్లో వినిపించాం.. ఇకపై చేతల్లో చూపుతామంటున్నారు ఆ పార్టీ నేతలు. ప్రత్యేక హోదా సాధన విషయంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు తమ చిత్తశుద్ధిని చాటుకోవడానికి ఈ దీక్ష ఉపయోగపడుతుందని వైసీపీ భావిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Special status  Jagan  YSRCP  Delhi  Jantarmantar  Protest  YSRCP  

Other Articles